MLA: ఎమ్మెల్యేకు నోటీసులు జారీ.. అసలేం జరిగిందంటే..
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:39 AM
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(Malkajgiri MLA Marri Rajasekhar Reddy)కి అల్వాల్ పోలీసులు ఇండియన్ కోడ్ సెక్షన్ 35(3) ప్రకారం శుక్రవారం నోటీసులు జారీ చేశారు.

- విధుల్లో ఉన్న డీసీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో..
హైదరాబాద్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(Malkajgiri MLA Marri Rajasekhar Reddy)కి అల్వాల్ పోలీసులు ఇండియన్ కోడ్ సెక్షన్ 35(3) ప్రకారం శుక్రవారం నోటీసులు జారీ చేశారు. గతేడాది మార్చిలో జీహెచ్‌ఎంసీ అల్వాల్ సర్కిల్ కార్యాలయం(GHMC Alwal Circle Office)లోకి విధుల నిర్వహణకు డిప్యూటీ కమిషనర్ శ్రీనివా్‌సరెడ్డి వెళ్తుండగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించారని డీసీ అల్వాల్ పోలీసులకు 6 మార్చి, 2024లో ఫిర్యాదు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: MLA: మీ ఉపాధికి ఇబ్బంది రాకుండా చూస్తా..
డిప్యూటీ కమిషనర్‌పై ఎమ్మెల్యే ఆయన అనుచరులు భౌతికదాడికి ప్రయత్నించడంతో పాటు అసభ్యంగా మాట్లాడారని, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆయన అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీసీ లిఖిత పూర్వకంగా పోలీసులను కోరారు. దీంతో దర్యాప్తు చేపట్టిన అల్వాల్ పోలీసులు ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరికి శుక్రవారం నోటీసులను పంపారు.
ఈవార్తను కూడా చదవండి: నాకు, రాహుల్‌కు మధ్య అగాధం వట్టిమాట
ఈవార్తను కూడా చదవండి: ముదిరిన పటాన్‌చెరు కాంగ్రెస్ లొల్లి.. పీసీసీ కమిటీ ఏం చెప్పిందంటే..
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Read Latest Telangana News and National News