Dharmapuri Arvind: గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:58 AM
ప్రపంచంలో అత్యధికంగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్ నేతలను గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. రప్పా రప్పా జైల్లో వేస్తే మరిన్ని స్కామ్‌లు బయటపడే అవకాశం ఉందన్నారు.

కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌ను వదిలిపెడితే.. రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం భూస్థాపితం
29న అమిత్ షా నిజామాబాద్ పర్యటన: ఎంపీ అర్వింద్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): ప్రపంచంలో అత్యధికంగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్ నేతలను గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. రప్పా రప్పా జైల్లో వేస్తే మరిన్ని స్కామ్‌లు బయటపడే అవకాశం ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావును వదిలిపెడితే రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు. ఇటీవల హరీశ్‌రావు ధర్నాలో రప్పా రప్పా 3.0 అని ప్రదర్శించిన ప్లకార్డులపై అర్వింద్ సెటైర్లు వేశారు. 3.0 కాదు.. వచ్చే ఎన్నికల్లో మూడు సీట్లు వస్తే గొప్ప అని ఎద్దేవా చేశారు. సోమవారం నిజామాబాద్‌లో అర్వింద్ మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఓటమి తప్పదని.. ఆ పార్టీ అగ్ర నాయకులు కేసీఆర్, కేటీఆర్, కవిత కూడా ఓడిపోతారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో హరీశ్‌రావు మినహా ఎవరూ గెలవరని చెప్పారు. ఆయన సిద్దిపేటను వదిలేస్తే ఓడిపోవడం పక్కా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న దర్యాప్తులను పక్కాగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ఉదయం బీఆర్‌ఎ్‌సను బెదిరించి.. సాయం త్రం సూట్‌కే్‌సలు తీసుకోవద్దని అన్నారు. బీఆర్‌ఎ్‌సతో కుమ్మక్కైతే కాంగ్రె్‌సకు పుట్టగతులుండవని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవిని ఇవ్వకపోవడాన్ని ప్రజలు హర్షించరని అన్నారు. ఈ నెల 29న అమిత్‌షా నిజామాబాద్‌లోని పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని అర్వింద్ తెలిపారు. అదే రోజు పాలిటెక్నిక్ కాలేజీ మైదానంలో రైతు సమ్మేళనం ఉంటుందని చెప్పా రు. నగరంలోని బైపాస్ రోడ్‌లో డీఎస్ విగ్రహాన్ని అమిత్‌షా ప్రారంభిస్తారని తెలిపారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అర్వింద్ నివాళులర్పించారు.
బనకచర్లతో నష్టం లేదు: డీకే అరుణ
బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డి జిల్లా కమ్మదనంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని అరుణ డిమాండ్ చేశారు.
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు డిమాండ్
కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, పాయల్ శంకర్, రామారావు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన ఈఈ ని పట్టుకుంటే రూ.200 కోట్లు, ఈఎన్‌సీని పట్టుకుంటే రూ.500కోట్ల ఆస్తులు బయటపడ్డాయని, ఈ లెక్కన కేసీఆర్ ఏ మేరకు దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎ్‌సఎ్‌స ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ నిజాయితీపరులైతే సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.