Mulugu: పసికందు మృతదేహంతో మంత్రుల ఎదుట నిరసన
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:01 AM
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అనంతరం ఓ పసికందు మృతి చెందింది. ప్రసవం ఆలస్యంగా చేయడమే పసికందు మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

ప్రసవం అనంతరం మృతి చెందిన శిశువు
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ధర్నా
విచారణ చేయిస్తామన్న మంత్రి సీతక్క
ములుగు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అనంతరం ఓ పసికందు మృతి చెందింది. ప్రసవం ఆలస్యంగా చేయడమే పసికందు మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అదే సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క రెవెన్యూ సదస్సుకు వెళ్తుండగా.. బాధిత కుటుంబ సభ్యులు కాన్వాయ్ వద్ద నిరసన తెలిపారు. మంత్రులకు పసికందు మృతదేహాన్ని చూపుతూ న్యాయం చేయాలని కోరారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన రవళి పురిటినొప్పులతో గురువారం సాయంత్రం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది.
రవళికి నార్మల్ డెలివరీ కాగా.. పాప పుట్టింది. అయితే.. కాసేపటికే తల్లీబిడ్డల ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. వారిని వరంగల్‌కు తీసుకెళ్తున్న క్రమంలో శిశువు మృతి చెందింది. అయితే నార్మల్ డెలివరీ అవుతుందంటూ ములుగు ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా ఆలస్యం చేయడం వల్లే పసికందు మృతి చెందిందంటూ కుటుంబసభ్యులు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే అటుగా వచ్చిన మంత్రుల ఎదుట నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి సీతక్క ఈ ఘటనపై కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపడతామని, వైద్యుల నిర్లక్ష్యమని తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో పసికందు కుటుంబ సభ్యులు శాంతించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News