MLC Ravindhar Rao: రేవంత్‌రెడ్డి.. ఓ డమ్మీ సీఎం
ABN , Publish Date - Aug 02 , 2025 | 01:56 PM
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక.. ప్రజలకు ముఖం చూపించలేక సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లుడు.. కాంగ్రెస్ పెద్దల కాళ్లు మొక్కుడు చేస్తున్నాడని ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్‌రావు విమర్శించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్సీ రవీందర్‌రావు విలేకరుల సమావేశం నిర్వహించారు.

- ఢిల్లీ వెళ్లుడు.. కాంగ్రెస్ పెద్దల కాళ్లు మొక్కుడే ఆయన పని
- తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు
- పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
- బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్‌రావు
హనుమకొండ(వరంగల్): ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక.. ప్రజలకు ముఖం చూపించలేక సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లుడు.. కాంగ్రెస్ పెద్దల కాళ్లు మొక్కుడు చేస్తున్నాడని ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్‌రావు విమర్శించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్సీ రవీందర్‌రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ.. 2023 న వంబరులో బీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు గురువా రం కీలక తీర్పునిచ్చిందన్నారు.
ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటీషన్లు పెండింగ్‌లో ఉంచడం సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం తెలిపిందని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సభ్యత్వం వెంటనే రద్దు అయ్యేలా చట్టాన్ని మార్చాలని కోరారు.
ప్రజలు నమ్మి కాంగ్రె్‌సను గెలిపిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని రవీందర్‌రావు విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ చేతుల్లోనే కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్‌గా మారిందని అన్నారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, సెక్రటేరియేట్‌లో ప్రభుత్వ అధికార యంత్రాంగంతో సమీక్షలు జరపడానికి ఆమె ఎవరు అని ప్రశ్నించారు. సంగారెడ్డి ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం ఘటనలో మంత్రులతో సమీక్ష చేయడంపై మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి డమ్మీ సీఎం అని లీడర్‌కు, క్యాడర్‌కు ఎప్పుడో తెలిసిపోయిందని అన్నారు. రేవంత్‌ను పక్కకు బెట్టి మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రె్‌సపార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జనార్ధన్‌గౌడ్, పులి రజినీకాంత్, బుద్దె వెంకన్న, కోడెపాక దేవమ్మ, పోలెపల్లి రాంమూర్తి, వీరేందర్, నయీమొద్దీన్, మహేందర్, మూటిక రాజు, రమేష్, శ్రీకాంతాచారి, సతీష్, గౌస్‌ఖాన్, రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే
సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!
Read Latest Telangana News and National News