MLC Kavitha: పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు?
ABN, Publish Date - Jun 29 , 2025 | 04:43 AM
నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఇప్పటికే రెండుసార్లు ప్రారంభించారని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడోసారి ప్రారంభించేందుకు వస్తున్నారని, ఇలా ఇంకెన్నిసార్లు ప్రారంభిస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
పసుపు పంటకు 15వేల మద్దతు ధర ఇవ్వాలి: కవిత
హైదరాబాద్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఇప్పటికే రెండుసార్లు ప్రారంభించారని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడోసారి ప్రారంభించేందుకు వస్తున్నారని, ఇలా ఇంకెన్నిసార్లు ప్రారంభిస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. చిత్తశుద్థి ఉంటే దానికి చట్టబద్ధత కల్పించాల శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పసుపు బోర్డుకు ఇదివరకే ప్రారంభోత్సవాలు చేసిన సంగతి ఎంపీ అర్వింద్ కేంద్ర హోం మంత్రికి చెప్పలేదేమోనని ఎద్దేవా చేశారు. అమిత్ షా పసుపు పంటకు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.
కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, యాకుత్‌పురా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు శనివారం కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. కాగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు కవిత నివాళులు అర్పించారు. కాగా, తెలంగాణ జాగృతితో సీపీఐ సాంస్కృతిక విభాగం యువ కళావాహిని కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని కేరళకు చెందిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సందోష్‌కుమార్ తెలిపారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఆమెతో సందోష్ భేటీ అయ్యారు.
Updated at - Jun 29 , 2025 | 04:43 AM