MLC Kavitha: ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు బెనిఫిట్స్ ఎప్పుడిస్తారు..
ABN , Publish Date - Jul 30 , 2025 | 07:55 AM
ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ఆకలికేకలు ఎవరికీ పట్టడం లేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ అందక 16 వేల కార్మిక కుటుంబాలు పూట గడవడానికే అవస్థలు పడుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ఆకలికేకలు ఎవరికీ పట్టడం లేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ అందక 16 వేల కార్మిక కుటుంబాలు పూట గడవడానికే అవస్థలు పడుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) ఆరోపించారు. పెండింగ్ బకాయిలు, పింఛన్ కోసం కార్మికులు అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయారని,
వారికి పెండింగ్ ప్రయోజనాలను ఎప్పుడిస్తారో కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పడం లేదని మంగళవారం ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారులతీరుతో విసిగిపోయిన రిటైర్డ్ కార్మికులు ఇక నుంచి ప్రతి సోమవారం నిరసన తెలపాలని నిర్ణయం తీసుకోవడం ఈ సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు.
పెన్షన్ సదుపాయమే లేకుండా ఉద్యోగంలో చేరి తక్కువ వేతనాలతో పనిచేసిన శ్రామిక్, డ్రైవర్, కండక్టర్ క్యాడర్ కార్మికుల పరిస్థితి మరింత ఘోరంగా ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించి 16 వేల మంది కార్మిక కుటుంబాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని, వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!
బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష
Read Latest Telangana News and National News