MLA: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:06 AM
ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నేను శంకుస్థాపనలు చేసిన పనుల వద్ద ఫొటోలు దిగుతూ షో చేస్తున్నరు.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు పెనుదుమారానికి దారితీశాయి. కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీగౌడ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యా్ఖ్యలతో నియోజకవర్గంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.

- నేను శంకుస్థాపనలు చేసిన పనుల వద్ద ఫొటోలు దిగుతూ షో చేస్తున్నరు
- ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
హైదరాబాద్: 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ శివారు తూర్పు 21 కాలనీల డ్రైనేజీ లైన్ల కోసం తాను దాదాపు 6కోట్ల నిధులను మంజూరు చేసి శంకుస్థాపనలు చేస్తే ఇవి శిలాఫలకాలకే పరిమితం అవుతాయని, ఎలక్షన్ స్టంట్ అని విమర్శించిన కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీ, స్థానిక కార్పొరేటర్ లచ్చిరెడ్డిలు ఆ పనుల దగ్గర ఫొటోలు దిగుతూ షో చేస్తున్నారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Devireddy Sudheer Reddy) విమర్శించారు. గురువారం బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ రాచకాలువ పరిధిలోని రాచకాలువ డ్రైనేజీ ట్రంక్‌లైన్ నిర్మాణం కోసం రెవెన్యూ, ఇరిగేషన్, జలమండలి అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు.
ఈ వార్తను కూడా చదవండి: Trains: వేసవిలో 20 వీక్లీ స్పెషల్ రైళ్లు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రైనేజీ ఔట్‌లెట్ పోయే దారిలేక పనులు జక్కిడి రామస్వామిరెడ్డి కాలనీ వరకే నిలిచిపోయాయన్నారు. ఈ పనుల కోసం స్థానిక కార్పొరేటర్ ఎలాంటి ప్రయత్నం చేయకపోగా తామే డ్రైనేజీ పనులు ఆపుతున్నామని కాలనీల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా డ్రైనేజీ ఔట్‌లెట్ కోసం తాము తీవ్ర ప్రయత్నం చేసి పురాతనమైన రాచకాలువను గుర్తించి ఈ కాలువగుండా ట్రంక్‌లైన్ వేద్దామని తాము ప్రణాళిక చేస్తుంటే కార్పొరేటర్ అక్రమ వసూళ్లకు తెరలేపి తన అండదండలతో అనేక చోట్ల రాచకాలువ మీద అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్పొరేటర్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఆ విషయాలు త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. రాచకాలువపై చేపట్టిన అక్రమ కట్టడాలన్నీ హైడ్రా దృష్టికి తీసుకెళ్లి కూల్చివేయిస్తామన్నారు. ఎమ్మార్వో, సర్వేయర్, ఆర్‌ఐ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా ఈ రాచకాలువ సర్వే మొత్తం పూర్తి చేశారని, రెండు, మూడు రోజుల్లో మార్కింగ్ చేసి డ్రైనేజీ ట్రంక్‌లైన్ పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, జలమండలి జీఎం శ్రీనివాస్‌రెడ్డి, డీజీఎం రాజ్‌గోపాల్, సర్వేయర్ జ్యోతి, ఇరిగేషన్ డీఈ శుక్లజ, గాయత్రినగర్‌కాలనీ ఫేజ్-2 అధ్యక్షులు ఆవుల రమేష్, మనోజ్‌కుమార్, శశికాంత్, నందకిషోర్, సతీష్ గౌడ్, విజయ్‌గౌడ్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బస్తర్‌లో కాల్పుల విరమణ అత్యవసరం
ఆర్‌ఎస్‌ఎస్ తరహాలో.. ప్రజల్ని కలవండి
గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయండి
Read Latest Telangana News and National News