Minister Thummala Nageshwar Rao : బీజేపీ నేతలకు మంత్రి తుమ్మల కౌంటర్..
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:13 PM
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కౌంటర్ ఇచ్చారు. పంటల కాలాలు, ఎరువుల కేటాయింపు, సరఫరాలపై బీజేపీ నేతలు అవగాహన పెంచుకోవాలని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కౌంటర్ ఇచ్చారు. పంటల కాలాలు, ఎరువుల కేటాయింపు, సరఫరాలపై బీజేపీ నేతలు అవగాహన పెంచుకోవాలని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు చేస్తున్న రాజీనామ సవాళ్లు రాజకీయల కోసం కాకుండా ఎరువుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వాడాలని హితవు పలికారు.
తమ ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్ కోసం కేటాయించిన ఎరువులు గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం అరిగిపోయిన గ్రామ ఫోన్ లాగా పదే.. పదే.. 2024-25 యాసంగి గురించి మాట్లడటం వారి అవివేకానికి అద్దం పడుతుందని విమర్శించారు.
కేంద్రం సప్లై చేసిన యూరియా రాష్ట్రంలో పక్కదారి పట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. బ్లాక్ మార్కెట్ కు తరలివెళ్లిందని నిరూపిస్తే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఎరువుల కొరతకు సంబంధించి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలు పూర్తిగా అసత్యమని అన్నారు.