Minister Ponnam: అభివృద్ధి మంత్రమే కాంగ్రెస్‌ను గెలిపిస్తుంది..
ABN , Publish Date - Jul 30 , 2025 | 09:37 AM
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నిక టికెట్టును స్థానికులకే కేటాయించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆశావాహులంతా కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 5లోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

- స్థానికులకే జూబ్లీహిల్స్ టికెట్టు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై పొన్నం
- అభివృద్ధి మంత్రమే కాంగ్రెస్‌ను గెలిపిస్తుందని వెల్లడి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నిక టికెట్టును స్థానికులకే కేటాయించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. ఆశావాహులంతా కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 5లోని ఓ హోటల్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు.
సర్వేల ద్వారా సరైన అభ్యర్థిని ఏఐసీసీ ఎంపిక చేస్తుందన్నారు. కంటోన్మెంట్(Cantonment) ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. పేదలకు వారు ఉంటున్న ప్రాంతాల్లోనే పక్కా గృహాలను నిర్మించేలా ఇందిరమ్మ మోడల్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఆగస్టు 1 నుంచి నగరంలో ఉన్న 15 నియోజకవర్గాల్లో రేషన్‌కార్డులు పంపిణీ మొదలు పెడుతున్నట్టు చెప్పారు. సమావేశంలో నాయకులు అజహరుద్దీన్, నవీన్‌యాదవ్, కార్పొరేటర్లు బాబాఫసీయుద్దిన్, సీఎన్ రెడ్డి, భవానీ శంకర్, గొంటి సాయినాథ్‌యాదవ్, కిరణ్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!
బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష
Read Latest Telangana News and National News