Share News

Kanchi Kamakoti Peethadhipati: కట్టు బొట్టుకు తెలంగాణ ప్రసిద్ధి: శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి

ABN , Publish Date - Oct 29 , 2025 | 07:55 PM

సిద్ధిపేట జిల్లా కొండపాక మండలంలోని మర్పడగ విజయదుర్గ అమ్మవారికి స్వర్ణ కిరీటధారణ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువు శంకరాచార్యులు, శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కట్టు, బొట్టుకు తెలంగాణ ప్రసిద్ధి అని పేర్కొన్నారు.

Kanchi Kamakoti Peethadhipati: కట్టు బొట్టుకు తెలంగాణ ప్రసిద్ధి: శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి
Kanchi Kamakoti Peethadhipati Shri Shankara Vijayendra Saraswati

సిద్ధిపేట, అక్టోబర్ 29: కట్టు, బొట్టుకు తెలంగాణ ప్రసిద్ధి అని కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువు శంకర చార్యులు, శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి తెలిపారు. రాష్ట్రంలో హాస్పిటల్లు, రహదారులు, ఫ్యాక్టరీలు ఎలాగో వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, గోసంరక్షణ, శాస్ర్తియ సంగీతం, కట్టు, బొట్టు అనేవి చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ధర్మం, శాంతి, సౌఖ్యం, వికాసంతో కలిగిన ఆధ్యాత్మిక కార్యక్రమలకు నెలవు కావాలని ఆకాంక్షిసున్నట్లు ఆయన పేర్కొ్న్నారు. బుధవారం సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ విజయదుర్గ అమ్మవారికి స్వర్ణ కిరీటధారణ చేసిన కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువు శంకరాచార్యులు, శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. 1998లో జయేంద్ర సరస్వతి అప్పటి డీజీపీ హెచ్ జే దొర సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి ధర్మం, శాంతి ఏర్పడేలా ప్రచారం చేశామని గుర్తు చేశారు.


తెలంగాణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతి, సౌఖ్యాన్ని కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. గత 30 ఏళ్లుగా సిద్దిపేట ప్రాంతం ఆధ్యాత్మికంగా వెలుగొందుతుందని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద దేవాలయాలను బాగు చేస్తున్నట్లే.. గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాలను సైతం అభివృద్ధి చేయాలని దాతలకు పిలుపు నిచ్చారు. 33 జిల్లాలన్ని ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందేలా గుడి, వేద పాఠశాల, గో సంరక్షణ, అన్న ప్రసద వితరణ వంటి కార్యక్రమాలతో ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలు ఉన్నట్లు.. హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలతో ధార్మిక యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.


మనం సంస్కృతి, సంప్రదాయలను పాటిస్తూ భావితరాల పిల్లలకు వాటి ఆవశ్యకతను తెలియచేయాలని పెద్దలు, తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. వ్యాపారం, వ్యవసాయం, చేతి పనులు చేసేవారు ఎవరైనా గ్రామాల్లో కుటుంబం, గుడి, గ్రామం అనే విధంగా ఉండి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు. నేటి కంప్యూటర్ యుగంలో వైఫై ఎలా కొనసాగుతుందో అలాగే వేదాలు, శాస్త్రాలు, వ్యవసాయం, ధార్మికత అనేవి వైఫై సేవలలాగా కొనసాగాలని శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఆకాంక్షించారు.

మర్పడగ విజయదుర్గ అమ్మవారికి కిరీటధారణ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతికి వేద మంత్రోచరణాలతో వేద పండితులు ఘన స్వాగతం పలికిన పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతితోపాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సత్యసాయి జయంతి వేడుకలపై పిల్.. పిటిషనర్‌కు హైకోర్టు వార్నింగ్

అలా అయితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవడమే..: కవిత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 08:01 PM