Share News

Pashamylaram: పరిశ్రమలో పేలుడు.. 15కి పెరిగిన మృతులు

ABN , Publish Date - Jun 30 , 2025 | 10:00 PM

పాశుమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ధాటికి పలు మృతదేహాలు చిద్రమైనాయి. దీంతో ఆయా మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

Pashamylaram: పరిశ్రమలో పేలుడు.. 15కి పెరిగిన మృతులు
Blast in pashamylaram

సంగారెడ్డి, జూన్ 30: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి.. మరణించిన వారి సంఖ్య 15కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో పలు మృతదేహాలు చిద్రమయ్యాయి. గుర్తు పట్టలేని విధంగా తయారయ్యాయి. దీంతో ఈ మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అందుకోసం కుటుంబ సభ్యుల సంపిల్స్ సేకరించారు. మరో మూడు మృతదేహాలను గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


ఉమ్మడి మెదక్ జిల్లా పాశమైలారంలోని పారిశ్రామికవాడలోని పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పలువురు గాలిలోకి ఎగిరిపడ్డారు. అయితే ఇప్పటి వరకు పలు మృతదేహాలను వెలికి తీశారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మియాపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం సంభవించిన సమయంలో పరిశ్రమలో 108 మంది ఉన్నారు.


దీంతో తమ వారు ఎలా ఉన్నారో నంటూ ఆ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో పోలీసులకు, వారికి మధ్య తొపులాట జరిగింది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి మోదీతోపాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు కేబినెట్ మంత్రులు స్పందించి.. విచారం వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బనకచర్లకు అనుమతి ఇవ్వలేం.. నిపుణుల కమిటీ

ఇన్ని జరిగినా పాఠాలు నేర్చుకోరా?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 10:09 PM