Share News

Mandakrishna Madiga: ఎస్సీ వర్గీకరణ చేసే వరకు అప్రమత్తంగా ఉందాం..

ABN , Publish Date - Feb 25 , 2025 | 12:14 PM

అందరికీ న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసేంత వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లోకి వెళ్లి అన్ని విషయాలను వివరించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) పిలుపునిచ్చారు.

Mandakrishna Madiga: ఎస్సీ వర్గీకరణ చేసే వరకు అప్రమత్తంగా ఉందాం..

సికింద్రాబాద్: అందరికీ న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసేంత వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లోకి వెళ్లి అన్ని విషయాలను వివరించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) పిలుపునిచ్చారు. తమకు రావలసిన న్యాయమైన వాటా కోసం మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని కోరారు. సికింద్రాబాద్‌ బాలంరాయిలోని డ్రీమ్‌ల్యాండ్‌ గార్డెన్‌లో సోమవారం జరిగిన ఎమ్మార్పీఎస్‌, అనుబంధ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఎస్సీ వర్గీకరణలో శాస్త్రీయత, హేతుబద్దత పూర్తిగా లోపించిందని అన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వారికి మరోసారి అవకాశం..


అన్ని కులాల్లో అసంతృప్తి నెలకొని ఉందని, అందుకే అందరికీ న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. మాలలు మినహా ఎస్సీ వర్గీకరణను ఎస్సీలలోని మిగతా 58కులాలు కోరుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికను పూర్తిగా అధ్యయనం చేయకుండానే ఎస్సీ వర్గీకరణను ఆమోదించిందని అన్నారు.


అశాస్త్రీయంగా ఉన్న వర్గీకరణలో తప్పులను, లోపాలను సవరించి, అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చూడాలని అన్నారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎంపీ వెంకటేష్‌ నేత, బీసీ నేత డాక్టర్‌ పృథ్వీరాజ్‌ యాదవ్‌, సయ్యద్‌ ఇస్మాయిల్‌, హోలియా దాసరి రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్‌, హైదరాబాద్‌ జిల్లా నాయకులతో పాటు ఎంఎ్‌సఎఫ్‌ జాతీయ అధికార ప్రతినిధి సోమశేఖర్‌, కొమ్ము శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఏఆర్‌ డెయిరీ ఎండీకి చుక్కెదురు

ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్‌ కుమ్మక్కు

ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2025 | 12:14 PM