Share News

Komatireddy Venkatreddy: వారి క్షేమం కోసం మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Feb 26 , 2025 | 09:43 AM

Komatireddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత మూడు రోజులుగా టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచూకి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి సహాయక బృందాలు.

Komatireddy Venkatreddy: వారి క్షేమం కోసం మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు
Minister komatireddy Venkatreddy

నాగర్‌కర్నూలు, ఫిబ్రవరి 26: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు రోజులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దోమలపెంటలోనే ఉండి మరీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా టన్నెల్‌ చిక్కుకున్న వారి క్షేమం కోసం మంత్రి శ్రీశైలం వెళ్లారు. నేటి (బుధవారం ) ఉదయం దోమలపెంట నుంచి శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి వెళ్లారు సీఎం. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది సురక్షితంగా తిరిగిరావాలని శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేయించారు.


శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకొని.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థన చేశారు. లక్షలాది మంది రైతులు, ఫ్లోరైడ్ భాదితుల జీవితాలను మార్చే టన్నెల్ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రాజెక్ట్ పనులు కొనసాగాలని ఆ దేవదేవుణ్ణి మొక్కినట్లు దర్శనానంతరం మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

వల్లభనేని వంశీకి పోలీసుల షాక్..


కాగా.. ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ 14వ కి.మీ మైలురాయి వద్ద సుమారు మూడు కిలోమీటర్ల మేర పై కప్పు కుప్పకూలింది. ప్రమాద సమయంలో టన్నెల్‌లో దాదాపు 50 మంది కార్మికులు పనులు చేస్తున్నారు. అయితే 42 మంది సురక్షితంగా బయటపడగా.. ఎనిమిది మాత్రం గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు సహాయక సిబ్బంది.


వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, హైడ్రా, సింగరేణి రెస్క్యూటీమ్‌లు సహాయక చర్యలు చేపట్టారు.అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి మరీ సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే బురద, నీరు సహాయక చర్యలకు అడ్డుతగులుతున్న పరిస్థితి. అయితే మూడు రోజులు అవుతున్నప్పటికీ ఎనిమిది మంది ఆచూకీ లభించకపోవడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. టన్నెల్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించడంతో జలవనరులశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన హెలికాఫ్టర్‌లో బయలుదేరి వెళ్లారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం దురదృష్టకరమని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.


టన్నెల్‌లో గల్లంతైన వారంతా పంజాబ్, జమ్మూ, యూపీ, జార్ఖండ్‌కు చెందిన వారుగా అధికారులు తెలిపారు. గుర్‌జీత్‌ సింగ్‌(పంజాబ్‌), సన్నీత్‌సింగ్‌ (జమ్ముకశ్మీర్‌), శ్రీనివాసులు (యూపీ), మనోజ్‌ రూబెన (యూపీ), సందీప్‌ (ఝార్ఖండ్‌), సంతోష్‌ (ఝార్ఖండ్‌), జట్కా హీరాన్‌ (ఝార్ఖండ్‌)లు గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు.


ఇవి కూడా చదవండి...

Maha Shivarathri: తెలంగాణలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

SLBC Tunnel: కదిలిస్తే కన్నీరే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 09:54 AM