Madiga Reservation: మాదిగలకు 10% రిజర్వేషన్లివ్వాలి
ABN , Publish Date - Feb 06 , 2025 | 04:35 AM
‘‘మాదిగ జనాభాకు అనుగుణంగా 10ు రిజర్వేషన్లు కల్పించాలి. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.

వర్గీకరణపై రేవంత్ నిర్ణయం భేష్
ఏటా ఫిబ్రవరి 5న విజయోత్సవం: నేతలు
క్రీమీలేయర్ కోసం 18 నుంచి దీక్ష
మాదిగ మహా కూటమి చైర్మన్ కిరణ్
వర్గీకరణ సరికాదు: మాల విద్యార్థులు
కాంగ్రె్‌సకు క్రెడిట్ రావడం మంద కృష్ణకు ఇష్టం లేదు: పిడమర్తి రవి
వర్గీకరణతో రాజ్యాధికారం: మోత్కుపల్లి
మార్చి 1న అమరుల సంస్మరణ: వంగపల్లి
బర్కత్‌పుర/పంజాగుట్ట/కవాడిగూడ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘‘మాదిగ జనాభాకు అనుగుణంగా 10ు రిజర్వేషన్లు కల్పించాలి. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నాం. ఏటా ఫిబ్రవరి 5ను వర్గీకరణ విజయోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించాం’’ అని పలు మాదిగ సంఘాల నేతలు వెల్లడించారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు జన్ను కనక రాజు, మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చిట్టుపాక ప్రభాకర్, తెలంగాణ మాదిగ సంఘాల సమన్వయ కర్త లాయర్ మల్లన్న, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి సర్కారుకు మాదిగలు అండగా ఉంటారని ముక్తకంఠంతో చెప్పారు. కాగా.. జస్టిస్ సమీర్ అక్తర్ కమిషన్ ప్రతిపాదనకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణలో క్రీమీలేయర్‌ను అమలు చేయాలని తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ మాదిగ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 18 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బర్కత్‌పురతోని మహాకూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎ్‌స/ఐపీఎస్ అధికారులు, గ్రూప్-1 అధికారులు, మేయర్లు, జడ్పీ చైర్మన్ల వారసులను రిజర్వేషన్ల నుంచి మినహాయించాలన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేయడం మందకృష్ణ మాదిగకు ఇష్టం లేదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆరోపించారు. బీజేపీ కోసమే మాదిగలకు 11ు రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. వర్గీకరణ నిర్ణయంపై అభినందనలు తెలుపుతూ.. పిడమర్తి బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు సన్మానం చేశారు. 30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమంలో ఏనాడూ 11ు రిజర్వేషన్ కోరలేదని గుర్తుచేశారు. మూడు దశాబ్దాలుగా 7ు రిజర్వేషన్ కోరి.. ఇప్పుడు 11ు కావాలనడం అర్థరహితమన్నారు.
దళితులు ఐక్యంగా ఉద్యమించాలి: మోత్కుపల్లి
ఎస్సీ వర్గీకరణ ద్వారానే దళితులకు రాజ్యాధికారం దక్కుతుందని, ఆ దిశగా దళితులంతా ఐక్యంగా ఉద్యమించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. మాల సోదరులు కలిసి వస్తే సమష్టిగా అభివృద్ధి చెందవచ్చన్నారు. బుధవారం ఎమ్మార్పీఎ్‌స(టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వర్గీకరణ విజయాన్ని అమరులకు అంకితం చేస్తూ.. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటూ.. ఆయనను అభినందించారు. వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మార్చి 1న మాదిగ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..
Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..