KTR: ఢిల్లీ యాత్రల్లో రేవంత్ అర్ధ శతకం: కేటీఆర్
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:36 AM
ఢిల్లీ యాత్రల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అర్ధ శతకం కొట్టారు తప్ప రాష్ట్రానికి నయా పైసా లాభం చేయలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ యాత్రల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అర్ధ శతకం కొట్టారు తప్ప రాష్ట్రానికి నయా పైసా లాభం చేయలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 50సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారో చెప్పే దమ్ముందా..? అని ప్రశ్నించారు. ఢిల్లీ యాత్రలతో రాష్ట్రానికి సాధించింది ఏమిటో రేవంత్‌రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని కేటీఆర్ శనివారం ప్రకటనలో డిమాండ్ చేశారు. ఢిల్లీ బాసుల కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.
బనకచర్లతో మన వ్యవసాయ రంగం పెను సంక్షోభంలోకి కూరుకుపోతుందని తెలంగాణ తల్లడిల్లుతుంటే.. రేవంత్ మాత్రం గురువు చంద్రబాబుకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోవడంతో నీళ్లు రాక రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే.. సీఎంకు కనీస పట్టింపు లేదన్నారు. కాగా, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఒక్కొక్కరూ పరకాయ ప్రవేశం చేసి వార్తలు రాస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్, బీఆర్‌ఎ్‌సను బద్నాం చేసే విధంగా ఆధారాలు లేకుండా వార్తలు రాయొద్దని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News