Share News

KIMS: రక్తపోటు రోగుల కోసం.. కిమ్స్‌ సన్‌షైన్‌లో రీనల్‌ డెనర్వేషన్‌ థెరపీ

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:08 AM

రక్తపోటు నియంత్రణకు రోగులకు చేసే రీనల్‌ డెనర్వేషన్‌ థెరపీ అనే వైద్య విధానం హైదరాబాద్‌, బేగంపేటలోని కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో అందుబాటులోకి రానుంది.

KIMS: రక్తపోటు రోగుల కోసం.. కిమ్స్‌ సన్‌షైన్‌లో రీనల్‌ డెనర్వేషన్‌ థెరపీ

  • మెడ్‌ట్రానిక్‌తో అవగాహన ఒప్పందం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): రక్తపోటు నియంత్రణకు రోగులకు చేసే రీనల్‌ డెనర్వేషన్‌ థెరపీ అనే వైద్య విధానం హైదరాబాద్‌, బేగంపేటలోని కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో అందుబాటులోకి రానుంది. కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో రీనల్‌ డెనర్వేషన్‌ థెరపీ సెంటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మెడ్‌ట్రానిక్‌ అనే సంస్థతో కిమ్స్‌ సన్‌షైన్‌ ఆస్పత్రి యాజమాన్యం బుధవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.


కిమ్స్‌ గ్రూప్‌ చైర్మన్‌, ఎండీ డాక్టర్‌ భాస్కర్‌రావు, కిమ్స్‌-సన్‌షైన్‌ ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ ఏవీ గురవారెడ్డి, కిమ్స్‌ సన్‌షైన్‌ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీధర్‌ కాస్తూరి, మెడ్‌ట్రానిక్‌ ఎండీ, వైస్‌ ప్రెసిడెంట్‌ మందీప్‌ సింగ్‌ కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా

ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..

For More AP News and Telugu News

Updated Date - Apr 10 , 2025 | 05:08 AM