Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ టిక్కెట్ రేసులో కిలారి మనోహర్
ABN , Publish Date - Jun 28 , 2025 | 10:00 PM
ఉపఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. రేపు అమిత్ షా రాకతో అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలపాలనేదానిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. తనకు టిక్కెట్ కేటాయిస్తే, గెలిచి చూపిస్తానని కిలారి మనోహర్..

Jubilee Hills By Elecion: రేపు (జూన్ 29)న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తుండటంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరుగబోతోంది. నిజామాబాద్ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి వస్తున్న అమిత్ షా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశంపై కూడా పార్టీ నేతలకు కీలక సూచలు చేస్తారని సమాచారం. గ్రేటర్ పరిధిలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక్కరే. దీన్ని రెండంకెలకు తీసుకెళ్లాలని కమలనాధులు ఆత్రంగా ఉన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి ఆచితూచి వ్యవహరించి జూబ్లీహిల్స్ స్థానం వశం చేసుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సరైన అభ్యర్థి కోసం కమలదళం ముమ్మరంగా మల్లగుల్లాలు పడుతోంది. ఇక, ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి బరిలో దిగేందుకు పలువురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. అందులో ప్రధానంగా బీజేపీ నేత కిలారి మనోహర్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఎలాగైనా పార్టీ పెద్దల్ని ఒప్పించి టిక్కెట్ సాధించి జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోవాలని కిలారి కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది.
మరో వైపు, బీజేపీ నుంచి మహిళా నేత జూటూరి కీర్తిరెడ్డి కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సైతం టిక్కెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఇటీవలే పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు మరికొందరు నేతలు సైతం బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇక, జూబ్లీహిల్స్ స్థానాన్ని ఎలాగైనా కైవశం చేసుకోవాలని తెలంగాణలోని అన్ని ప్రముఖ పార్టీలూ పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఆ సెగ్మెంట్‌ను ఎలాగైనా తిరిగి దక్కించుకుని పరువు నిలుపుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తుండగా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రెస్టీజియస్‌గా తీసుకుంది.
ఇవి కూడా చదవండి
మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్
Phone Tapping: ఆ మెయిలే పట్టిచ్చింది!
Read Latest AP News And Telugu News