Share News

Minister Thummala:మహిళా సంఘాలకు పండుగలాంటి వార్త.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

ABN , Publish Date - Jun 19 , 2025 | 10:03 PM

మహిళా సంఘాలకు త్వరలో 381 డ్రోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇవాళ(గురువారం) ఖమ్మం కలెక్టరేట్‌లో ఎరువుల సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర‌రావు మీడియాతో మాట్లాడారు.

Minister Thummala:మహిళా సంఘాలకు పండుగలాంటి వార్త.. మంత్రి తుమ్మల  కీలక ప్రకటన
Minister Thummala Nageswara Rao

ఖమ్మం: మహిళా సంఘాలకు త్వరలో 381 డ్రోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు. ఇవాళ(గురువారం) ఖమ్మం కలెక్టరేట్‌లో ఎరువుల సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడారు. రూ. 104 కోట్లతో వ్యవసాయ యాంత్రికరణ చేస్తున్నామని ప్రకటించారు.


నియోజకవర్గాల వారిగా కేటాయింపులకు సన్నాహాలు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. జొన్న రైతులకు చెల్లించాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలని సూచించారు. రేపు(శుక్రవారం) జరగనున్న CACP దక్షిణ ప్రాంతీయ సమావేశంలో చర్చించాల్సిన విషయాల గురించి మంత్రి తుమ్మల దిశానిర్ధేశం చేశారు. నమో డ్రోన్ దీదీ'' కింద సరఫరా అయ్యే 381 డ్రోన్లను మహిళా సంఘాలకు అందించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


కమిషన్ కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Minister Ponguleti Srinivas Reddy

కమిషన్ కోసమే గత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. ఇవాళ(గురువారం) సూర్యాపేట జిల్లాలోని మోతే మండలం విభాలాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. మొదటి విడత 4లక్షల ఇళ్లు, నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇళ్లు ఇస్తామని చెప్పారు.


ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ దత్తత తీసుకుని పట్టించుకోని వాసాలమర్రిని తాము అభివృద్ధి చేస్తామని అన్నారు. రూ.22,500 కోట్లతో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఆగస్టు లోపు భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ

యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 10:08 PM