Bhatti Vikramarka: ఇది మంచి పరిణామం: డిప్యూటీ సీఎం భట్టి
ABN , Publish Date - Nov 22 , 2025 | 02:03 PM
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిరుపేదలకు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని అందించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.
ఖమ్మం, నవంబర్ 22: వైరాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయటం మంచి పరిణామమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం నాడు వైరా నియోజకవర్గ కేంద్రంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్, వైరా నియోజకవర్గంలో రూ. 21 కోట్ల వ్యయంతో నిర్మించబోయే 7 సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 200 శాతం చార్జీలు పెంచింది తమ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.
బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్య ద్వారానే వారు ఉన్నత స్థానానికి చేరుతారన్నారు. గత పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ డ్వాక్రా మహిళలను మోసం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో రూ.590 కోట్లు వెచ్చించి నిరుపేదలకు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని అందించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది తామే అన్నారు.
తాను పుట్టిన ఈ నేలను తప్పనిసరిగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశానని తెలిపారు. గతంలో వైరా రిజర్వాయర్ రైతుల కోసం నీటిని వదిలే విషయంలో జైలుకి కూడా వెళ్లినట్లు గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం రైతులకు అంకితమని.. దోపిడీదారులకు, దొంగలకు కాదన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిచే విధంగా తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రూ.6 లక్షలకు శిశువు విక్రయం.. కరీంనగర్‌లో దారుణం
సైబర్ నేరాలపై అవగాహన, అప్రమత్తత ఉండాల్సిందే: సీపీ సజ్జనార్
Read Latest Telangana News And Telugu News