Share News

Kavitha KCR: కవితను పలకరించని కేసీఆర్‌!

ABN , Publish Date - Jun 12 , 2025 | 02:54 AM

కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరయ్యే క్రమంలో ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరుతున్న తండ్రి కేసీఆర్‌ను పలకరించేందుకు కవిత వెళ్లగా..

Kavitha KCR: కవితను పలకరించని కేసీఆర్‌!

  • గుడ్‌ మార్నింగ్‌ డాడీ.. అంటూ కవిత పలకరింపు మాట్లాడకపోగా..

  • ఆగాలంటూ కేసీఆర్‌ సైగ

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరయ్యే క్రమంలో ఫాంహౌస్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరుతున్న తండ్రి కేసీఆర్‌ను పలకరించేందుకు కవిత వెళ్లగా.. గులాబీ బాస్‌ ఆమెతో ఒక్క మాటైనా మాట్లాడలేదని సమాచారం. కేసీఆర్‌ గది వద్దకు చేరుకున్న కవిత గుడ్‌ మార్నింగ్‌ డాడీ అని పలకరించగా.. అందుకు ప్రతిస్పందనగా ఆగమంటూ ఆయన సైగ చేశారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే విచారణకు వెళ్లే హడావుడిలో ఉన్న కారణంగానే ఆమెతో కేసీఆర్‌ మాట్లాడలేదని బీఆర్‌ఎస్‌ నాయకుడొకరు చెప్పుకొచ్చారు. బుధవారం ఉదయం 8.15గంటలకు భర్త అనిల్‌తో కలిసి ఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సకు కవిత చేరుకున్నారు. పై అంతస్తు నుంచి లిఫ్ట్‌లో కేసీఆర్‌ కిందకు వచ్చే వరకు అనిల్‌, కవిత.. కేసీఆర్‌ వెంటే ఉన్నట్లు సమాచారం.


అక్కడి నుంచి కేసీఆర్‌ కాన్వాయ్‌ హైదరాబాద్‌కు బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత ఆమె తన వాహనంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తొలిసారి కవిత.. ఫామ్‌హౌ్‌సకు రావడం, కేసీఆర్‌ బయలుదేరే వరకూ భర్త అనిల్‌తో కలిసి అక్కడే ఉండడం బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా, కవిత విషయంలో బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగాలు వివక్షతో వ్యవహరిస్తున్నాయని తెలంగాణ జాగృతి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఫాంహౌస్‌ నుంచి కేసీఆర్‌ బయలుదేరే సమయంలో తీసిన వీడియోల్లో.. కవిత ఉన్నప్పటికీ ఆమె కనబడకుండా ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియా వేదికల్లో పోస్టు చేశాయని మండిపడుతున్నాయి. కాగా, ఫాంహౌస్‌లో కాలు జారి గాయపడి ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.


ఇవి కూడా చదవండి

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2025 | 07:40 AM