ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:32 PM
ఉగ్రవా దానికి వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ సీనియర్ నాయ కులు పల్లె సదానందం పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తున్నామన్నారు.

పెద్దపల్లిటౌన్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవా దానికి వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ సీనియర్ నాయ కులు పల్లె సదానందం పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తున్నామన్నారు. మానవాళికి వ్యతి రేకంగా జరిగే ఇటువంటి అనాగరిక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. నేటి బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పర్శ సమయ్య, మౌటమ్ నర్సింగం, మొర మనోహర్, శివం గారి సతీష్, మంథని కృష్ణ రాజవీర్, పాల్గొన్నారు.
పెద్దపల్లి కల్చరల్,(ఆంధ్రజ్యోతి): పహల్గాంలో జరి గిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొ త్తులతో ర్యాలీ నిర్వహించి మృతులకు నివాళులర్పిం చారు. పాకిస్తాన్ ఉగ్రవాద మూకలను తరిమికొడతాం. జైభారత్ అంటూ నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అన్నాడి వెంకట్‌రెడ్డి, సందీప్, సంపత్ రెడ్డి, స్వామి, కొట్టె లక్ష్మయ్య, గుంటి కుమార్, రాజ మల్లు, కృష్ణారెడ్డి, పాల్గొన్నారు.
గోదావరిఖని, (ఆంధ్రజ్యోతి): కశ్మీర్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి బీఎంఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తు లతో నివాళులర్పించారు. స్థానిక యూనియన్ కేంద్ర కార్యాలయం చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వ హించి నివాళులర్పించారు. యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గావ్ పర్యాటక కేంద్రంలో హిందువులపై కాల్పులు జరిపి చంపిన పాకి స్తాన్ తీవ్రవాదుల పిరికిపంద చర్యగా అభివర్ణించారు. నాయకులు మాదాసి రవీందర్, కర్రావుల మహేష్, వడ్డేపల్లి కుమారస్వామి, దారావత్ తిరుపతి, మీనుగు సంతోష్, గంగిశెట్టి నరసింహులు, ఎల్లావుల కోటయ్య, రాజశేఖర్, పల్లె శ్రీనివాస్, సల్ల వేణు, పాల్గొన్నారు.
కళ్యాణ్‌నగర్, (ఆంధ్ర జ్యోతి): జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూ రాలని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొ త్తులతో ర్యాలీ నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు అమరేందర్‌రావు మాట్లాడుతూ ఉగ్రవాదులు దాడి చేసి పర్యా టకులను పొట్టన పెట్టుకున్నారని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంథెన శ్రీనివాస్, చెరుకు బుచ్చిరెడ్డి, అశోక్‌రావు, జీవన్‌బాబు, చింతల రాజిరెడ్డి, మంచికట్ల బిక్షపతి, రాజేందర్, పాల్గొన్నారు.