Home » Peddapalli
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రామగుండం ప్రజలకు మంచినీరు ఇవ్వడం చేతకాక ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని, కౌశిక హరి ఒక సైకోలా తిరుగుతున్నాడని మేయర్ మహం కాళి స్వామి విమర్శించారు. మంగళవారం గోదావరి ఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మేయర్, కార్పొరేటర్లు మాట్లాడారు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ నెలలో జరిగే మహనీయుల జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వేణు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 5న బాబు జగ్జీవన్ రాం జయంతి, 14న అంబేద్కర్ జయంతి అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ నూగిళళ మల్లయ్య పేర్కొన్నారు. బస్టాండ్ ఆవరణలో మంగళవారం మహాలక్ష్మీ పథకం సంబురాలు నిర్వహించారు.
రక్తదానం చేసి ప్రాణదాతలుగా గుర్తింపు పొందాలని జిల్లా జడ్జి కుంచాల సనీత సూచించారు. కోర్టు ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రక్తం సమయానికి అందక ఎందరో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్లం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేయాలని పెద్దపల్లి పట్టణానికి చెందిన విఠల్ కలెక్టర్ కోయ శ్రీహర్షను వేడుకోగా పరిశీలించాలని కలెక్టర్ మున్సిప ల్ కమిషనర్‌ను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సం దర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి కలెక్టరేట్‌లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
సహకార సంఘాలు రైతుల అభివృద్ధికి పని చేస్తున్నాయని, ప్రతీ పంట సీజన్‌లో వారికి రుణాలు అందజేస్తున్నాయని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాదాక్రిష్ణ అన్నారు. సుల్తానాబాద్ సహకార సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం సంఘ భవన ఆవరణలో నిర్వహించారు.
మత్తు పదార్థాలు, మద్యం, గంజాయి వంటి వాటికి యువత దూరంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ భుక్య రాంరెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐ మల్లేష్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని మండలంలోని హన్మంతునిపేట బృందావన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు.
సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయాన్ని టీబీజీకేఎస్ నాయకులు నల్ల జెండాలతో ముట్టడించారు.
కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను విరమించుకోవాలని ఏప్రిల్ 1న కలెక్టరేట్ ఎదుట చేపట్టే ధర్నాకు తరలిరావాలని ఐఎఫ్‌టీయూ నాయకులు పేర్కొ న్నారు. ఆదివారం జిల్లా కార్మిక సంఘాల సమావేశం ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో నరేష్ అధ్యక్షతన జరిగింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న అక్షర ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ లాంగ్ లైవ్ ఆల్ సొసైటీ) కార్యక్రమంలో ద్వారా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో చదువురాని మహిళలకు చదువు నేర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.