Share News

Tiger Attack: ఆ జిల్లా ప్రజలను వణికిస్తున్న పెద్దపులి.. బయటకు రావొద్దని హెచ్చరికలు..

ABN , Publish Date - Jan 24 , 2025 | 08:10 AM

జగిత్యాల: జిల్లాలో పెద్దపులి(Tiger) సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కొడిమ్యాల(Kodimyala) మండలం కొండాపూర్(Kondapur) గ్రామంలో ఓ రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపేసింది.

Tiger Attack: ఆ జిల్లా ప్రజలను వణికిస్తున్న పెద్దపులి.. బయటకు రావొద్దని హెచ్చరికలు..
Tiger Attack

జగిత్యాల: జిల్లాలో పెద్దపులి(Tiger) సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కొడిమ్యాల (Kodimyala) మండలం కొండాపూర్ (Kondapur) గ్రామంలో ఓ రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు కళేబరాన్ని పరిశీలించారు. ఆవు గొంతు కొరికి చంపిన పులి దాని వెనకభాగం మెుత్తం తినేసినట్లు గర్తించారు. అయితే తొలుత దాడి చేసింది చిరుతపులిగా ఫారెస్ట్ అధికారులు అనుమానించారు. ఆ తర్వాత ఆవు కళేబరం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రికార్డయిన దృశ్యాల ఆధారంగా దాడి చేసింది చిరుత కాదని, పెద్దపులని నిర్ధారించారు.

మార్చి 6 నుంచి టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు


పెద్దపులి సంచారం నేపథ్యంలో కొండాపూర్, చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. కొండాపూర్ సహా రామకృష్ణాపూర్, బొల్లోని చెరువు, దమ్మయపేట గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి వేళ బయటకు రావొద్దని, రైతులు, రైతు కూలీలు పొలాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. కాగా, పెద్దపులి సంచారంతో కొడిమ్యాల మండల ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందేమోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: దావోస్ ధమాకా!

Khammam: కొత్తగూడెం, సాగర్‌లలో ఏఏఐ బృందం

Updated Date - Jan 24 , 2025 | 08:11 AM