Share News

పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ పాలన

ABN , Publish Date - Aug 02 , 2025 | 11:48 PM

రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మంథని మున్సి పాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళలు వ్యాపార రంగంలో అభివృద్ధి చెంద టానికి స్పెషల్‌ ఇండస్ట్రి యల్‌ పార్కును మం థని శివారులో ఏర్పాటుకు కృషి చేస్తున్నామ న్నారు.

పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ పాలన

మంథని/మంథనిరూరల్‌, ఆగస్టు 2 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మంథని మున్సి పాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళలు వ్యాపార రంగంలో అభివృద్ధి చెంద టానికి స్పెషల్‌ ఇండస్ట్రి యల్‌ పార్కును మం థని శివారులో ఏర్పాటుకు కృషి చేస్తున్నామ న్నారు. వారికి వ్యాపార రంగంలో నైపుణ్యాల శిక్షణ ఇప్పించడానికి వీ-హబ్‌ ఉప కేంద్రాన్ని పెద్దపల్లిలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద డెయిరీ, పౌలీ్ట్ర ఫాంల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయా లన్నారు. మంథనిలో కుట్టుమిషన్‌ శిక్షణ ఏర్పా టు చేశామని, రాబోయే కాలంలో కొన్ని కంపె నీల ఏర్పాటు కోసం ప్రతిపాదనలకు యోచి స్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టామన్నారు. రైతులకు ఒక సంవత్సరంలోనే 21 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారికి రెండు లక్షల రుణ మాఫీ పూర్తి చేశామన్నారు. రైతుల కోసం రూ.9 వేల కోట్ల రైతుభరోసా డబ్బులు విడుదల చేశామన్నారు. తొలి ఏడాదిలోనే 60 వేల నిరు ద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించా మన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులకు నూతన రేషన్‌ కార్డులను అందిస్తున్నా మన్నారు. దీన్ని ద్వారా ప్రతీ కుటుంబానికి సగటున నెలకు రూ.12 వందల విలువ గల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామ న్నారు. రూ. 2వందల కోట్లకు పైగా మహిళల ఉచిత ప్రయాణానికి జీరో టిక్కెట్లు జారీ చేసి రూ.6,680 కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు. పేద కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వి ద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. మం థని నియోజకవర్గంలో మొదటి దశలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. యేటా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ఇండ్ల స్థలా లు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూములు కేటా యించి ఇందిరమ్మ ఇండ్లు కట్టించే సంక ల్పం చేస్తున్నామన్నారు. గురు కుల విద్యార్థులకు 40 శాతం డైట్‌ చార్జీలు పెంచామన్నారు. అడవిసోమన్‌పల్లిలో రూ.2 వం దల కోట్లు ఖర్చు చేసి కార్పొ రేట్‌కు దీటుగా ఇంటిగ్రే టేడ్‌ గురుకుల పాఠశాలను నిర్మిస్తు న్నామన్నారు. వివిధ శాఖల అధి కారులు, కాంగ్రెస్‌ పార్టీ నేతలు, మహిళలు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవాలు..

మంథని మున్సిపాలిటీ పరిధి లో రూ.6.70 కోట్లతో నిర్మించిన పాత పెట్రోల్‌ పంపు సమీపంలో సెంట్రల్‌ లైటింగ్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. సిం గరేణి సంస్థ సీఎస్‌ఆర్‌ ద్వారా పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడే క్యూర్‌కోడ్‌ మెటీరి యల్‌ హైస్కూల్‌ విద్యార్థులకు అందజేశారు. వన మహోత్సవంలో మొక్కలు నాటారు. మం డల పరిషత్‌ కార్యాలయం వద్ద నమునా ఇంది రమ్మ ఇంటిని, మున్సిపాలిటీలో రూ.20.50 కోట్లతో 410 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పైలాన్‌ శంకుస్థాపన చేశారు. ఈజీఎస్‌ నిధులు రూ.1.70 కోట్లతో నిర్మించే గ్రామ పంచాయతీల భవనాలకు శంకుస్థాపన చేశారు. ఏఎంసీ కార్యా లయం వద్ద పాలకవర్గాన్ని సన్మానించారు. ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు, సీఎం ఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి చెక్కులను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అన్న య్యగౌడ్‌తో కలిసి పంపిణీ చేశారు.

Updated Date - Aug 02 , 2025 | 11:48 PM