Share News

వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:34 PM

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం వేసవి శిక్షణ తరగతు లను నిర్వహిస్తున్నామని, వాటి ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొ న్నారు. సోమవారం కలెక్టరే ట్‌లో ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో జిల్లాలోని అన్ని గ్రామాలలో 1నుంచి 7వ తరగతి చదివే విద్యార్థులకు మే1 నుంచి జూన్‌ 10 వరకు సమ్మర్‌ క్యాంపు నిర్వహిస్తున్నామ న్నారు.

వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

పెద్దపల్లి కల్చరల్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం వేసవి శిక్షణ తరగతు లను నిర్వహిస్తున్నామని, వాటి ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొ న్నారు. సోమవారం కలెక్టరే ట్‌లో ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో జిల్లాలోని అన్ని గ్రామాలలో 1నుంచి 7వ తరగతి చదివే విద్యార్థులకు మే1 నుంచి జూన్‌ 10 వరకు సమ్మర్‌ క్యాంపు నిర్వహిస్తున్నామ న్నారు. 400మంది వలంటీర్లతో 305ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మర్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తు న్నామని, రోజు ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు తరగతులు ఉంటాయ న్నారు.

వలంటీర్లు విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగే విధంగా గైడెన్స్‌ ఇస్తారని కలెక్టర్‌ అన్నారు. విద్యార్థులకు గొప్ప లక్ష్యాలను ఏర్పచు కోవడం నేర్పాలని, ముఖ్య పాఠ్యాంశాలను బోధించడం, క్రీడలు, నీతికథలు, చదువు ప్రాముఖ్యత, విలువలు బోధిస్తామని కలెక్టర్‌ తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను సమ్మర్‌ క్యాంపునకు పంపాలని, వలంటీర్లకు గౌరవ వేతనం ఇస్తామని పేర్కొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:34 PM