ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:36 PM
కర్రె గుట్ట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్‌ను ఆపాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు నిర్వహించాలని సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వ ర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఐఎఫ్‌టీయు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దులో గల కర్రెగుట్ట యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుందన్నారు.

పెద్దపల్లిటౌన్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): కర్రె గుట్ట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్‌ను ఆపాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు నిర్వహించాలని సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వ ర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఐఎఫ్‌టీయు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దులో గల కర్రెగుట్ట యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుందన్నారు. సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసి, గిరి జనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయానక వాతావరణంలో మగ్గు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది సాయుధ పోలీస్ బలగాలు తిష్ట వేసుకుని ఏకపక్ష దాడుల్ని కొనసాగించడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.
అడవి, ప్రకృతి ఖనిజ సంపదను అంబానీ, ఆదానీలకు అప్పచెప్పే కుట్రలో భాగంగానే ఆదివాసి ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కర్రెగుట్ట ప్రాంతం నుంచి పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించాలని, అరెస్టు చేసిన ఆదివాసి గిరిజను లను వదిలిపెట్టాలని, ఆపరేషన్ కగార్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపసం హరించుకోవాలని సూచించారు. మావోయిస్టు పార్టీ ఇటీవలి కాలంలో శాంతి చర్చలకు తాము సిద్దమని పదే పదే ప్రకటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహారించడం సరికాదన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్, నాయకులు బి అశోక్, చిలుక శంకర్, రాజేశం, కొల్లూరి మల్లేష్, చంద్రయ్య, కాదాసి లింగమూర్తి, గుండేటి మల్లేశం పాల్గొన్నారు.