పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఓసీపీ సందర్శన
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:42 PM
ఆర్‌జీ-1 ఏరియాలో మూతపడిన మేడిపల్లి ఉపరితల గనిని శనివారం తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్‌పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కర్నాటి వరుణ్‌రెడ్డి సందర్శించారు. మేడిపల్లి ఉపరితల గని వద్ద నిర్మించనున్న పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్‌జీ-1 ఏరియా జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి మేడిపల్లి ఉపరితల గని వ్యూ పాయింట్ ద్వారా సందర్శించారు.

గోదావరిఖని, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఆర్‌జీ-1 ఏరియాలో మూతపడిన మేడిపల్లి ఉపరితల గనిని శనివారం తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్‌పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కర్నాటి వరుణ్‌రెడ్డి సందర్శించారు. మేడిపల్లి ఉపరితల గని వద్ద నిర్మించనున్న పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్‌జీ-1 ఏరియా జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి మేడిపల్లి ఉపరితల గని వ్యూ పాయింట్ ద్వారా సందర్శించారు.ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను జీఎంను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ తరలింపు, ఖర్చు, గ్రిడ్ కనెక్టివిటీకి సంబంధించి అధికారులతో చర్చించారు. ఎస్‌ఓటూ జీఎం ఆంజనేయ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ ఇన్‌చార్జి జితేందర్ సింగ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, వీరారెడ్డి, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్, మేనేజర్ మల్లిఖార్జున్ యాదవ్, టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ (ఆపరేషన్) వీ గంగాధర్, ఏడీఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.