Share News

Kondagattu Fire Accident: కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. 22 షాపులు దగ్ధం

ABN , Publish Date - Nov 30 , 2025 | 06:35 AM

కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 22 షాపులు దగ్ధమయ్యాయి.

Kondagattu Fire Accident: కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. 22 షాపులు దగ్ధం
Fire Expolsion

జగిత్యాల జిల్లా, నవంబర్ 30: కొండగట్టు(Kondagattu)లో పెద్దఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని ఓ బొమ్మల షాపులో షార్ట్ సర్క్యూట్(Short Circuit) కారణంగా ఈ మంటలు వ్యాపించాయి. భారీఎత్తున మంటలు చెలరేగడంతో సమీపంలోని సుమారు 22 షాపులు దగ్ధమయ్యాయి.


అయితే.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో జనాలు ఊపిరిపీల్చుకున్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అగ్ని జ్వాలలను చూసి భయబ్రాంతులకు గురైన స్థానికులు.. భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు(Fire Officials) వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.


ఇవీ చదవండి:

సర్పంచలుగా చేసి సర్వం కోల్పోయాం..

ఏకగ్రీవంపై ఆశలు

Updated Date - Nov 30 , 2025 | 09:31 AM