Public Appeal: వీధి కుక్కలపై తీర్పును పునఃసమీక్షించండి
ABN , Publish Date - Nov 30 , 2025 | 05:15 AM
వీధి కుక్కల బెడదపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ శనివారం 50 వేలకు మందికి పైగా పౌరులు సుప్రీంకోర్టుకు లేఖలు రాశారు.
సుప్రీంకోర్టుకు 50వేల మంది లేఖలు
న్యూఢిల్లీ, నవంబరు 29: వీధి కుక్కల బెడదపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ శనివారం 50 వేలకు మందికి పైగా పౌరులు సుప్రీంకోర్టుకు లేఖలు రాశారు. చేతితో లేఖలు రాసి పోస్టు ద్వారా పంపారు. ఇందులో ఢిల్లీకి చెందిన 10వేల మంది ఉన్నారు. ఆస్పత్రులు, పాఠశాలల వంటి ప్రాంతాల్లో కుక్కలు లేకుండా చూడాలని, వాటికి జనన నియంత్రణ ఇంజెక్షన్లు ఇవ్వాలని సూచిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది జంతువుల హక్కులకు భంగకరమని పేర్కొంటూ అంబిక అనే జంతు సంక్షేమ కార్యకర్త వినతుల ఉద్యమాన్ని ప్రారంభించారు.