Share News

దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:07 AM

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న తలపెట్టిన బంద్‌లో సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఉద్యోగులు పాల్గొని విజయ వంతం చేయాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు పిలుపుని చ్చారు.

దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

గోదావరిఖని, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న తలపెట్టిన బంద్‌లో సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఉద్యోగులు పాల్గొని విజయ వంతం చేయాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు పిలుపుని చ్చారు. ఆదివారం గోదావరిఖనిలోని ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేస్తున్న నరేం ద్ర మోదీ నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా కొని క్యాప్టల్‌ ధారదత్తం చేస్తున్నా యని, సింగరేణి వంటి సంస్థలకు బొగ్గు బ్లాకులను కేటాయించకుండా విస్తరణకు అడ్డుపడుతుందన్నారు. 29 కార్మిక చట్టా లను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాసేం దుకు ప్రయత్నం చేస్తుందని, దేశ సంప దను ఆదాని, అంబానీలకు దోచిపడు తుందని ఆయన ఆరోపిచారు. 8గంటల పని విధానాన్ని తీసివేసి కార్మికులచే 12 గంటల వరకు పని చేయించుకోవడానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడా నికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందన్నారు. దీని వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కును కూడా కోల్పోతారన్నారు. మే 20న జరిగే సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. భూపాల్‌, తుమ్మల రాజారెడ్డి, మంద నర్సింహారావు, మధు, కుమారస్వామి, శ్రీనివాస్‌, బిక్షపతి, ముత్యంరావు, జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:07 AM