Share News

ఇండస్ర్టీయల్‌ పార్క్‌కు భూములు ఇవ్వం

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:27 AM

మండలంలోని రత్నాపూర్‌లో ఇం డస్ట్రీయల్‌ పార్క్‌పై శుక్రవారం ఆర్డీవో సురేష్‌ అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఆర్డీవో సురేష్‌ ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టపరిధికి లోబడి ఇండ్రస్ట్రీయల్‌ పార్క్‌ ఏర్పాటు చేయనుందని, అందుకు కావాల్సిన 203 ఎకరాల భూములు మేడిపల్లి పరిధిలోని 63 మంది రైతుల వద్ద సేకరిస్తామన్నారు. దీని పై గ్రామస్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

ఇండస్ర్టీయల్‌ పార్క్‌కు భూములు ఇవ్వం

రామగిరి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని రత్నాపూర్‌లో ఇం డస్ట్రీయల్‌ పార్క్‌పై శుక్రవారం ఆర్డీవో సురేష్‌ అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. ఆర్డీవో సురేష్‌ ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టపరిధికి లోబడి ఇండ్రస్ట్రీయల్‌ పార్క్‌ ఏర్పాటు చేయనుందని, అందుకు కావాల్సిన 203 ఎకరాల భూములు మేడిపల్లి పరిధిలోని 63 మంది రైతుల వద్ద సేకరిస్తామన్నారు. దీని పై గ్రామస్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. గతంలో గ్రామంలోని అనేక కార్యక్ర మాలకు భూములను స్వాధీనం చేసుకున్నారని ప్రజలు వాపో యారు.

ఇండ్రస్ట్రీయల్‌ పార్క్‌కు భూములు ఇవ్వమని మెజార్టీ ప్రజలు నిరాకరించారు. గ్రామంలోని సుమారు 50 మంది రైతు లు లిఖిత పూర్వకంగా సంతకం చేసి ఆర్డీవోకు అందజేశారు. గ్రామంలోని 203.31 ఎకరాలకు ప్రభుత్వ పట్టా భూమి 56.12 గుంటలు ఉండగా పట్టాభూమి 147.19 ఎకరాల్లోని సుమారు 60 మంది రైతులు వ్యతిరేకంగా 19 మంది అంగీకారం తెలుపుతూ పత్రాలను ఆర్డీవోకు అందజేసినట్లు తెలిసింది. స్థానికంగా లేని పట్టాదారులు అనుకూలంగా ఫోన్‌లో ఆర్డీవోకు సమాచారం ఇచ్చినట్లుగా సమాచారం. తహసీల్దార్‌ సుమన్‌, ఇండ్రస్ట్రీయల్‌ జిల్లా జోనల్‌ మేనేజర్‌ మహేశ్వర్‌, ఏవో శ్రీకాంత్‌, మంథని, గోదావరిఖని సీఐలు రాజు, ఇంద్రాసేనరెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:27 AM