Share News

లేబర్‌ కోడ్‌లు వెంటనే రద్దు చేయాలి

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:28 PM

కార్మిక వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం అన్ని కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి సునీల్‌, ఐఎన్‌టీయుసీ బూమల్ల చందర్‌, ఐఎఫ్‌టీయు నాయకులు కె. విశ్వ నాథ్‌, సిహెచ్‌ శంకర్‌, వైకుంఠం మాట్లాడారు.

లేబర్‌ కోడ్‌లు వెంటనే రద్దు చేయాలి

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కార్మిక వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం అన్ని కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి సునీల్‌, ఐఎన్‌టీయుసీ బూమల్ల చందర్‌, ఐఎఫ్‌టీయు నాయకులు కె. విశ్వ నాథ్‌, సిహెచ్‌ శంకర్‌, వైకుంఠం మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభు త్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నట్లు ఆరోపించారు. కార్మికవర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టా లను రద్దు చేసి, వాటి స్థానంలో 4 లేబర్‌ కోడ్‌లను ముందుకు తెచ్చిందని మండిపడ్డారు. వీటికి వ్యతిరేకంగా ఐదేళ్ళుగా కార్మికవర్గం చేస్తున్న ఆందోళన, పోరాటాలతో లేబర్‌ కోడ్‌ల అమలు 5 ఏళ్లు ఆలస్యమైనా, ఇప్పుడు వాటిని అమలు చేసి కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తోందన్నారు. 2025-26 బడ్జెట్‌లో కార్పొరేట్‌ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటా యింపులు చేసిందని, సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టిందని విమర్శిం చారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకొనేందుకు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించాయని తెలిపారు. సార్వ త్రిక సమ్మెకు సంయుక్త కిసాన్‌మోర్చా మద్దతు ప్రకటించిందన్నారు. రాష్ట్ర కార్మికవర్గం సమ్మెకు సమాయత్తం కావాలని, సంఘటిత, అసంఘటితరంగ కార్మికులు, ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు, ఉద్యోగులు సమ్మెను జయ ప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సేపెళ్లి రవీందర్‌, పూసాల రమేష్‌, జె. సమ్మిరెడ్డి, భీమయ్య, అశోక్‌, నరేష్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 11:28 PM