Insect in biryani: వామ్మో.. అసలు బిర్యానీ తినగలమా
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:10 PM
Insect in biryani: ఓ వ్యక్తి ఎంతో ఇష్టంగా బిర్యానీ తిందామని రెస్టారెంట్‌కు వచ్చాడు. చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. బిర్యానీ వచ్చిన వెంటనే తిందామని చూసిన కస్టమర్‌కు అందులో కనబడింది చూసి షాక్‌కు గురయ్యాడు.

జగిత్యాల, మార్చి 8: ఆహార నాణ్యత విషయంలో హోటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులు తమ తీరును మార్చుకోని పరిస్థితి. పలు మార్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి ఫుడ్ తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించని అనేక హోటళ్లను సీజ్‌లు కూడా చేశారు. కొద్ది రోజులు ఫుడ్ సేఫ్టీ అధికారుల హాడావుడి నడిచినా.. మళ్లీ షరామామూలే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు హోటల్ నిర్వాహకులు. డబ్బు సంపాందించడమే లక్ష్యంగా పెట్టుకున్న వీరు.. కస్టమర్లకు ఫుడ్ సర్వ్ చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులు ఎన్నిసార్లు హెచ్చిరించినా, హోటళ్లను సీజ్ చేసినా వారి బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు.
ఫుడ్ తయారీలో ప్రాణాంతక రసాయనాలు వాడటం, ఎక్స్‌పైరీ అయిన పదర్థాలు ఉపయోగించడం చేస్తున్నారు. అంతే కాకుండా ఆహారంలో పురుగులు, బొద్దింకలు రావడం కూడా మామూలైపోయింది. తాజాగా జగిత్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బిర్యానీ తినాలని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ప్లేట్‌లో ఉన్న బిర్యానీని తిందామని చూడగా అక్కడ కనిపించింది చూసి అవాక్కయ్యారు. ఫుడ్ తయారీలో హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం పట్ల కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగింది.. బిర్యానీలో ఏం బయటపడిందో ఇప్పుడు చూద్దాం.
Kishan Reddy Letter to Bhatti: మీ ఆహ్వానం ఆలస్యంగా అందింది.. అందుకే
ఇదీ విషయం..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఇష్ట రెస్టారెంట్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ కస్టమర్.. రెస్టారెంట్‌కు వచ్చి బిర్యానీని ఆర్డర్ చేశాడు. టేబుల్ వద్దకు వచ్చిన బిర్యానీని తిందామని అనుకునేలోపు అందులో కనిపించింది చూసి సదరు కస్టమర్ షాక్‌కు గురయ్యాడు. చికెన్ బిర్యానీలో బొద్దింక కనబడటంతో కస్టమర్ నివ్వెరపోయాడు. ఇదేంటంటూ రెస్టారెంట్ సిబ్బంది, మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కస్టమర్ వాపోతున్నారు. వెంటనే కిచెన్‌లోకి వెళ్లి చూడగా అక్కడ దృశ్యాలు చూసి కూడా ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అక్కడంతా చెత్తాచెదారంతో నిండిపోయిందని, బొద్దింకలు తిరుగుతున్నాయని కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
దీంతో ఇష్టా రెస్టారెంట్‌పై ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులకు అతడు ఫిర్యాదు చేశాడు. గతంలో కూడా కస్టమర్లతో రెస్టారెంట్ నిర్వాహకులు ఇలానే వ్యవహరించారి కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుమార్లు తనిఖీలు చేయగా.. నివ్వెరపోయే దారుణాలు చోటు చేసుకున్నాయన కస్టమర్లు చెబుతున్నారు. అయినప్పటికీ అధికారులు కూడా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి...
seethakka International Womens Day: మహిళలను ఎదగనిద్దాం... మహిళలను గౌరవిద్దాం.
Chandrababu Naidu: మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా ఏపీ
Read Latest Telangana News And Telugu News