Share News

జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:45 AM

జిల్లాలో వానాకాలం సాగు జోరందుకుంది. మూడు రోజులుగా ముసురు వానలతో వాడిపోతున్న పత్తి, మొక్కజొన్న మెట్ట పంటలు ఊపిరి పోసుకున్నాయి. దీంతో రైతులు హుషారుగా పొలం పనుల్లో బిజీగా మారిపోయారు.

జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జిల్లాలో వానాకాలం సాగు జోరందుకుంది. మూడు రోజులుగా ముసురు వానలతో వాడిపోతున్న పత్తి, మొక్కజొన్న మెట్ట పంటలు ఊపిరి పోసుకున్నాయి. దీంతో రైతులు హుషారుగా పొలం పనుల్లో బిజీగా మారిపోయారు. వరి నాట్లు జోరు పెరిగింది. ముసురు వానలోనూ రెండు రోజుల్లోనే పదివేల ఎకరాల్లో నాట్లు వేశారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 43వేల 783 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయడానికి రైతులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 1,78,990 ఎకరాల్లో సాగు చేశారు. వరి సాగు 1,32,110 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. పత్తి 43,300 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 2,903ఎకరాలు, కందులు 552 ఎకరాలు, పెసర 18 ఎకరాలు, ఇతర పంటలు 56 ఎకరాలో వేశారు.

చెరువులు, కుంటలకు జలకళ..

జిల్లాలో ముసురు వర్షాలతో సిరిసిల్ల మానేరు వాగు, వేములవాడ మూలవాగులతో పాటు చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. జిల్లా కేంద్రంలో పాటు వివిధ మండలాల్లో ముసురు వానతో రోడ్లు చిత్తడిగా మారి నడవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముస్తాబాద్‌, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ అర్బన్‌, వేములవాడ రూరల్‌, తంగళ్ళపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో చెరువుల్లోకి 75 శాతం నుంచి 100 శాతం వరకు నీళ్లు చేరాయి. మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలకు వాతావరణం చల్లబడింది. జిల్లాలో ఉన్న ప్రధానమైన ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది. మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌లోకి 235 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో ఇప్పటివరకు 27.55 టీఎంసీల సామర్థ్యానికి 6.965 టీఎంసీల నీరు ఉంది. ఎగువ మానేరు ప్రాజెక్టులో 0.78 టీఎంసీలు ఉంది. అన్నపూర్ణ ప్రాజెక్టులోకి వంద క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, 3.50 టీఎంసీలకు 1.25 టీఎంసీల నీరు నిల్వఉంది. జిల్లాలో శనివారం ఉదయం వరకు సగటు వర్షపాతం 25.9 మిల్లీమీటర్లు నమోదైంది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రుద్రంగిలో 45.0 మిల్లీమీటర్లు, గంభీరావుపేటలో 38.8 మిల్లీమీటర్లు, ముస్తాబాద్‌లో 37.8, వేములవాడ రూరల్‌ లో 36.3, ఇల్లంతకుంటలో 32.3, చందుర్తిలో 31.3, బోయిన్‌పల్లిలో31.2, సిరిసిల్లలో 22.5, తంగళ్ళపల్లిలో 29.3, ఎల్లారెడ్డిపేటలో 21.3, వీర్నపల్లిలో 18.5, కోనరావుపేటలో 21.5 వేములవాడలో 22.3 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.

జూలై 26వ తేది వరకు జిల్లాలో వర్షపాతం(మిల్లీమీటర్లలో)

మండలం సాధారణం కురిసింది

రుద్రంగి 357.2 200.2

చందుర్తి 374.6 306.0

వేములవాడ రూరల్‌ 346.7 306.5

బోయినపల్లి 304.1 259.9

వేములవాడ 353.5 315.8

సిరిసిల్ల 336.8 270.0

కోనరావుపేట 297.4 353.5

వీర్నపల్లి 313.7 293.7

ఎల్లారెడ్డిపేట 309.8 304.7

గంభీరావుపేట 299.4 339.8

ముస్తాబాద్‌ 265.7 352.3

తంగళ్లపల్లి 341.2 402.2

ఇల్లంతకుంట 258.9 339.6

---------------------------------------------

సగటు వర్షపాతం 319.9 310.6

-------------------------------------------------

జిల్లాలో ఇప్పటి వరకు వానకాలం పాగు ఇలా..

మండలం వరి పత్తి మొత్తం

గంభీరావుపేట 10,000 110 1,01,023

ఇల్లంతకుంట 22,500 12,000 35,470

ముస్తాబాద్‌ 17,500 530 18,265

సిరిసిల్ల 3,500 700 4,206

తంగళ్లపల్లి 13,000 870 13,953

వీర్నపల్లి 7,800 300 8,100

ఎల్లారెడ్డిపేట 11,000 2,500 13,500

బోయినపల్లి 4,800 6,400 11,280

చందుర్తి 10,000 6,100 16,122

కోనరావుపేట 14,000 3,200 17,200

రుద్రంగి 5,910 2,190 10,194

వేములవాడ 3,800 4,600 8,438

వేములవాడ రూరల్‌ 8,300 3,800 12,139

-----------------------------------------------------------------------

మొత్తం 1,32,110 43,300 1,78,990

-----------------------------------------------------------------------

Updated Date - Jul 27 , 2025 | 12:45 AM