మేడే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:03 AM
మేడే స్ఫూరితో కేంద్ర ప్రభు త్వంపై పోరాటం చేస్తామని ఐఎఫ్‌టియు జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి శంకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఎన్టీపీసీలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేక రుల సమావేశంలో మాట్లాడారు.

జ్యోతినగర్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): మేడే స్ఫూరితో కేంద్ర ప్రభు త్వంపై పోరాటం చేస్తామని ఐఎఫ్‌టియు జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి శంకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఎన్టీపీసీలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేక రుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను మారుస్తోందన్నారు. కార్మిక చట్టాలను సవరిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకు వస్తున్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదిం చిన కార్మికుల కనీస వేతనాల సవరణ జీవోలను అమలు చేయడం లేదన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం నెలకు 26 వేలు అమలు చేయడం లేదన్నారు. మే 20న దేశవ్యాప్తంగా నిర్వహి స్తున్న సమ్మెకు ఐఎఫ్‌టియు ప్రధాన భూమిక పోషిస్తున్నదని, సమ్మె విజయవంతానికి యూనియన్ కృషి చేస్తుందన్నారు. మేడే సందర్భంగా ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో ర్యాలీ ఎర్ర జెండాల ఆవిష్కరణ, సదస్సులు నిర్వహిస్తామని శంకర్ తెలిపారు. బుచ్చన్న, రాయమల్లు, పాల్గొన్నారు.