కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల కోసం కొట్లాట
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:30 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితిలో ఉందని, ఆ పార్టీలో మంత్రి పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. తెలంగాణాలో రాబోయేదీ బీజేపీ ప్రభుత్వమే నని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నా రు.

సుల్తానాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితిలో ఉందని, ఆ పార్టీలో మంత్రి పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. తెలంగాణాలో రాబోయేదీ బీజేపీ ప్రభుత్వమే నని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నా రు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపొందిన అనంతరం సుల్తానాబాద్‌లో మంగళవారం వారికి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీలో పలు జిల్లాల లో కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నారని, ఈ ప్రభు త్వం ఎప్పుడు పోతుందో తెలువదని, మళ్ళీ అధికారం లోకి వస్తుందో రాదో... ప్రభుత్వం ఉన్నపుడు అఽధికారం అనుభవించాలనే తపనతో ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారన్నారు. హైదరాబాద్ సెం ట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వ హించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంద న్నారు. స్థానిక ఎన్నికలలో గెలుపు కోసం ప్రయత్నిం చాలని తాము అండగా ఉంటామని, ఏ సమస్య ఉన్నా కాల్ చేస్తే స్పందిస్తామన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లా డుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. స్థానిక ఎన్నిక లలో నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపాలని, కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవా లన్నారు, దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో అవి నీతి రహిత పాలన సాగుతుందన్నారు. దేశంలో పదేళ్ల బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలు కుంభకో ణాలు లేకుండా మోదీ పాలన సాగిందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతు పార్టీ సిద్దాం తం ఆశయంగా కార్యక ర్తలు నాయకులు పని చేస్తున్నారని, బీజేపీలో చేరడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతున్నార న్నారు. మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, గోమాస శ్రీనివాస్, గొట్టెము క్కుల సురేష్‌రెడ్డి, కందుల సంధ్యారాణి, మీస అర్జున్ రావు, చల్లా నారాయణ రెడ్డి, శంకర్, గుర్రాల మల్లేశం, కడారి అశోక్ రావు, ఎస్‌ఎన్‌సీ వనజ, మిట్టపల్లి ప్రవీణ్, నాగరాజు, కందుల శ్రీనివాస్, మహేందర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు చెందిన నాయకులు పాల్గొ న్నారు. అంతకు ముందు ఐబీ చౌరస్తా నుంచి సభా వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు.