Share News

తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నా

ABN , Publish Date - Aug 02 , 2025 | 11:45 PM

తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీల ఎంపీలను కలుపుకుని ఉద్యమించామని, అప్పుడు తనకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం వచ్చినా తెలంగాణ కోసం వదులుకున్నానని రాష్ట్ర గను లు, భూగర్భ, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి పెద్దప ల్లిలో నిర్వహించిన ఆత్మీయ పౌర సన్మానంలో పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నా

పెద్దపల్లి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీల ఎంపీలను కలుపుకుని ఉద్యమించామని, అప్పుడు తనకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం వచ్చినా తెలంగాణ కోసం వదులుకున్నానని రాష్ట్ర గను లు, భూగర్భ, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి పెద్దప ల్లిలో నిర్వహించిన ఆత్మీయ పౌర సన్మానంలో పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తన తండ్రి కాకా వెంకటస్వామి ద్వారా ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. విశాఖ ట్రస్టు ద్వారా పెద్దపల్లి పార్ల మెంట్‌ పరిధిలోని 2 వేల ప్రభుత్వ పాఠశాలల్లో బోరింగులు వేసి ఫర్నీచర్‌ ఇచ్చామన్నారు. కాకా చేసిన పోరాటం వల్ల తనకు సింగరేణి నుంచి పింఛన్‌ వస్తున్నదని ఓ గని కార్మికుడు గుర్తు చేసిన విషయాన్ని తెలిపారు. కాకా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రేషన్‌ షాపులను తీసుక వచ్చారని, తాను మం త్రిగా రేషన్‌ కార్డులు పంపిణీ చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో 300 మంది ఆత్మ బలిదానం చేసు కుంటే ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఇచ్చామన్నారు. ఎంపీగా నియోజక వర్గంలో 700 కోట్లతో తాగునీటి పథకాలు తీసు క వచ్చి, రోడ్డు నిర్మాణ పనులు చేయించానని చెప్పారు. నష్టాలతో ఎఫ్‌సీఐ మూతపడడంతో 5 వేల మంది ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. దానిని తెరిపించేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో మాట్లాడి 10 వేల కోట్ల రుణ మాఫీ చేయించి తిరిగి నెలకొల్పేలా చేశామన్నారు. ఇసుక, మినరల్‌ మాఫియాను అరికడుతున్నా మని, తక్కువ ధరకు ప్రజలకు ఇసుక లభించేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా కృషి చేస్తు న్నామన్నారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా రైతు భరోసా, సన్న బియ్యం, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, తదితర పథకాలను అమలు చేసిందన్నారు. పార్లమెంట్‌లో గళం ఎత్తి సింగరేణి కార్మికుల కోసం 140 కోట్ల పింఛన్‌, పెద్దపల్లి, మంచిర్యాలలో పలు రైళ్లు హాల్టింగ్‌ కోసం వంశీకృష్ణ కృషి చేశారని అన్నారు. మమ్మల్ని ప్రోత్సహిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. నాయకులు గుమ్మడి కుమారస్వామి, సయ్యద్‌ సజ్జద్‌, పునుకొండ శ్రీధర్‌, భూషణవేణ రమేష్‌గౌడ్‌, బండారి సునీల్‌, ఎల్‌ రాజయ్య, మాల సంఘం నాయ కులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 11:45 PM