Share News

రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా సహకార సంఘాలు

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:51 AM

జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహ కార సంఘాలు ఇక నుంచి రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మారనున్నాయి. మొదటి విడతలో తొమ్మిది సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘా లుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఉండగా, మొదటి విడతలో 311 సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్చారు.

రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా సహకార సంఘాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహ కార సంఘాలు ఇక నుంచి రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మారనున్నాయి. మొదటి విడతలో తొమ్మిది సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘా లుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఉండగా, మొదటి విడతలో 311 సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్చారు. అందులో భాగంగా జిల్లాలో గల 20 సహకార సంఘాల్లో పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మేడిపల్లి, కమాన్‌పూర్‌, ముత్తారం, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్‌, నంది మేడారం, ధూళి కట్ట సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్చారు. మిగతా సంఘాలు విడతల వారీగా ఉత్పత్తిదారుల సంఘాలుగా మారనున్నాయి.

జిల్లాలో ఇప్పటికే జూలపల్లి, సుల్తానాబాద్‌ మండలం పెర్కపల్లి, పెద్దపల్లి, ముత్తారం, ఓదెలలో ఐదు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి. ఇవి కంపెనీల చట్టం కింద రిజిష్టర్‌ అయ్యాయి. ఒక్కో సంఘంలో 300 మందికి రైతులు సభ్యులుగా చేరి వాటా ధనం చెల్లించి కార్యకలాపాలను కొన సాగిస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ)తో అవగాహన ఒప్పందాలు చేసే ప్రక్రియను సహకార శాఖ ఆరంభించింది. రైతులు పండించిన ఉత్ప త్తులను మార్కెట్‌లోకి తీసుక రావడానికి, వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనడానికి వారి ఆర్థిక స్థితిగతు లను మెరుగుపర్చడానికి, రైతులకు సాంకేతికను పరిచయం చేయడం, మద్దతు ధరలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2025 నాటికి దేశ వ్యాప్తంగా 10 వేల రైతు ఉత్పత్తి దారుల సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొందరు రైతులు సభ్యులుగా చేరి కంపెనీల చట్టం, సహకార చట్టం ద్వారా గానీ రిజిస్ర్టేషన్‌ చేసి సేవలను ఆరంభించనున్నారు.

రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహ కార సంఘాలు అధికంగా ఉండడంతో వాటిని మొత్తం రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్చా లని నిర్ణయించింది. ఈ సంఘాలు రైతులకు పంట రుణాలు ఇవ్వడంతోపాటు వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ యంత్రాల కొనుగోలు కోసం దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది. అంతేగాకుండా రైతులు పండిం చిన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ సహకారంతో కొనుగోలు చేస్తున్నది. ఎరువులు, విత్తనాల విక్ర యాలు చేపడుతున్నది. ఇవేగాకుండా పెట్రోల్‌ బంక్‌లు, రైసుమిల్లులు, ఇతర వ్యాపార లావా దేవీలు నిర్వహిస్తుండడంతో వాటిని రైతు ఉత్పత్తి దారుల సంస్థల పరిధిలోకి తీసుక వస్తున్నారు.

జిల్లాలో 9 సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా గుర్తించి అభివృద్ధి చేయ డానికి రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ను క్లస్టర్‌ ఆధారిత వ్యాపార సంస్థగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. క్లస్టర్ల వారీగా ఉత్పత్తిదారుల సంస్థ లను నిర్వహణ, బేస్‌లైన్‌ సర్వే, ఏజెన్సీల అమలు, వ్యాపార ప్రణాళికల తయారీ, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను సహకార యూనియన్‌కు అప్పగించింది. పీఏసీఎస్‌లకు 15 లక్షల గ్రాంటు ఇవ్వనున్నారు. ఇవి నిలదొక్కుకోవడానికి ఏడాదికి 6 లక్షల రూపాయల చొప్పున 18 లక్షల రూపాయలు అందజేయనున్నారు. ఈ నిధులతో ఉత్పత్తిదారుల సంస్థలు రైతులకు కావాల్సిన వ్యవసాయ పని ముట్లను అందించడం, రైతులు పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు వంటి కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుగా ఇప్పటికే అనేక కార్యకలా పాలను నిర్వహిస్తున్నందున ఉత్పత్తిదారుల సంస్థ లుగా నిలదొక్కుకోవడం సులువేనని జిల్లా సహకార శాఖాధికారి శ్రీమాల తెలిపారు. జిల్లాలో ఉన్న 20 సహకార సంఘాల్లో 9 సంఘాలను రైతు ఉత్పత్తి దారుల సంస్థలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 12:51 AM