రజతోత్సవ సభకు తరలివెళ్ళిన బీఆర్‌ఎస్ శ్రేణులు
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:05 AM
బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభకు మంథని నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి పుట్ట మధు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం తరలివెళ్ళారు. జూనియర్ కళాశాల ఎదుట ఉన్న పార్టీ జెండాను పుట్ట మధు ఆవిష్కరించారు.

మంథని, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభకు మంథని నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి పుట్ట మధు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం తరలివెళ్ళారు. జూనియర్ కళాశాల ఎదుట ఉన్న పార్టీ జెండాను పుట్ట మధు ఆవిష్కరించారు. అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ సభకు వెళ్ళే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో మంథని నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకుం దన్నారు. ఒకే కుటుంబ పాలనతో మంథని నియోజక వర్గ ప్రజలకు న్యాయం జరగడం లేదన్నారు. మంథని నియోజకవర్గ నుంచి ఐదు వేల మందిని వాహనాల్లో తరలించామన్నారు. ఏగోళపు శంకర్‌గౌడ్, మాచీడి రాజుగౌడ్, తగరం శంకర్‌లాల్, మాదాడి శ్రీనివాస్‌రెడ్డి, గొబ్బూరి వంశీ, కనవేన శ్రీనివాస్ పాల్గొన్నారు.
మంథనిరూరల్: మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ శ్రేణులు తరలివెళ్ళారు. ఉదయం గ్రామాల్లో గులాబీ జెండాను ఎగురవేసిన అనంతరం వాహనాల్లో సభకు పెద్ద ఎత్తున తరలివెళ్ళారు. నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులు వరంగల్‌కు తరలివెళ్లారు. బీఆర్‌ఎస్ రజతోత్సవాల్లో భాగంగా వరం గల్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ఆయా గ్రామాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు జెండాలు ఆవిష్కరిం చారు. అనంతరం ఏర్పాటుచేసిన వాహనాల్లో వెళ్లారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీపీ తానిపర్తి స్రవంతిమోహన్‌రావులు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఆర్‌కె.రాజా, బద్దం తిరుపతిరెడ్డి, బాసంపల్లి రాజేష్, పోచయ్య ఉన్నారు.
కాల్వశ్రీరాంపూర్, (ఆంధ్రజ్యోతి): ఆయా గ్రామాల నుంచి బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభకు అధిక సం ఖ్యలో తరలివెళ్లారు. మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ జెండా ఊపి వాహనాలు ప్రారంభించారు. సింగిల్‌విండో చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, మాజీ జడ్పీటీసీ తిరుపతిరెడ్డి, నాయకులు పుప్పాల నాగార్జున రావు, నిదానపురం దేవయ్య, సారంగపాణి, మాదాసు చంద్రు, కొట్టె రవీందర్, తరలివెళ్లారు.
ఓదెల (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ సభకు మండలం నుంచి కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. గ్రామంలో బీఆర్‌ఎస్ జెండాలను ఆవిష్కరించి వాహనాల్లో తరలివెళ్ళారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మండలాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, కార్య కర్తలు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వ ర్యంలో తరలివెళ్లారు. ఆయా గ్రామాల్లో జెండాలను ఎగురవేసి స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకు న్నారు. నాయకులు, కార్యకర్తలు సభకు తరలివెళ్ళారు.