తల్లి పాలు పిల్లలకు శ్రేయస్కరం
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:39 PM
తల్లిపాలు పిల్లలకు శ్రేయస్కరమని సిమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సంద ర్భంగా శనివారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పిల్లల వైద్యులు, గైనకాలజిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కళ్యాణ్‌నగర్, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): తల్లిపాలు పిల్లలకు శ్రేయస్కరమని సిమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సంద ర్భంగా శనివారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పిల్లల వైద్యులు, గైనకాలజిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుట్టిన పిల్లలకు ముర్రిపాలు తాగించాలని, కొందరు తల్లులు పిల్లలకు పాలు ఇవ్వకపోవడం వల్ల వారి ఎదుగుదలతోపాటు అనారోగ్యానికి గురవు తున్నారని, తల్లి పాలు ఎంత ఇస్తే పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారన్నారు.
సూపరిం టెండెంట్ హిమబిందు, వైద్యులు రాజు, శిరీష, తల్లులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్ల ఆధ్వర్యంలో బాలింతలకు తల్లి పాల ప్రాముఖ్యత గురించి వివరించారు. పుట్టిన పిల్లలకు ముర్రిపాలు తాగించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. సూపర్‌వైజర్లు షరీన, జమున, మమత పాల్గొన్నారు.