కశ్మీర్ ఘటనను నిరసిస్తూ బంద్
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:02 AM
జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద మారణకాండను నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖనిలో బంద్ జరిగింది. వర్తక, వ్యాపార వర్గాలు బంద్‌కు స్వచ్ఛం దంగా మద్దతు ప్రకటించాయి. విశ్వహిందు పరిషత్, బజరంగ్‌దళ్, కాంగ్రెస్ నాయకులు వ్యాపార కేంద్రాల్లో తిరుగుతూ బంద్‌కు సహకరించాలని కోరారు.

కళ్యాణ్‌నగర్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద మారణకాండను నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖనిలో బంద్ జరిగింది. వర్తక, వ్యాపార వర్గాలు బంద్‌కు స్వచ్ఛం దంగా మద్దతు ప్రకటించాయి. విశ్వహిందు పరిషత్, బజరంగ్‌దళ్, కాంగ్రెస్ నాయకులు వ్యాపార కేంద్రాల్లో తిరుగుతూ బంద్‌కు సహకరించాలని కోరారు. అనం తరం చౌరస్తాలో మానవహారం నిర్మించారు. వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కాంగ్రెస్ నాయకుడు దీటి బాలరాజు మాట్లాడారు. హింసకు పాల్పడిన ఉగ్రవాదులను ఏరివే యాలని, పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేం దుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా భారత ప్రజా నీకం, పార్టీలు అండగా ఉంటాయ న్నారు. సంపత్ యాదవ్, మేడగోని రవీందర్, శ్రీనివాస్, మునగాల సం పత్, లింగన్న, జలేందర్, రాజేష్, గట్ల రమేష్, ఉల్లం గుల రమేష్, శ్రీనివాస్‌గౌడ్, మొహిద్ సన్ని, లక్ష్మీనర్స య్య, అందె రాజ్‌కుమార్, పంగ రవి, పాల్గొన్నారు.
జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): పహల్గామ్ ఉగ్రవాదుల ఘటనను అందరూ ఖండించాలని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు మెరుగు రమేష్ అన్నారు. మం డలకేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పహల్గామ్ ఘటనను వ్యతిరేకిస్తూ చేనేత, మగ్గం, పవర్‌లూమ్ కార్మికులు పద్మశాలి కుల సంఘం నాయ కులు కులవృత్తులకు బంద్ పాటించారు. ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన వారి ఆత్మ శాంతిచేకూరాలని మౌ నం పాటించారు. నాయకులు అందె రాజయ్య, సిరిపురం సత్యం, ఉప్పుల తిరుపతి, బైరి భూమయ్య, కోడూరి రాజేశ్వర్, దీకొండ ఆంజనేయులు, మెరుగు నుకయ్య, పాల్గొన్నారు.
కోల్‌సిటీటౌన్, (ఆంధ్రజ్యోతి): జమ్ముకాశ్మీర్ పహ ల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన మృతు లకు ఆదివారం గోదావరిఖనిలోని సింగరేణి ఉన్నత పాఠశాల సెక్టార్-2లో ఉపాధ్యాయులు ఘన నివాళుల ర్పించారు. ఆర్‌జీ-1 ఏరియా పర్సనల్ మేనేజర్ రవీం దర్‌రెడ్డి ఆధ్వర్యంలో పర్యాటకుల కుటుంబాలకు సాను భూతిని తెలియజేస్తూ ఉపాధ్యాయులు కొవ్వొ త్తులు వెలిగించి సంతాపం తెలిపారు. పీవో దేవాచారి, సం క్షేమాధికారి ఫిరోజ్‌ఖాన్, పాఠశాల ఇంచార్జీ ప్రధానో పా ధ్యాయురాలు స్వర్ణలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.