Kachiguda: కాచిగూడ రైల్వేస్టేషన్‌కు 109 ఏళ్లు..
ABN , Publish Date - Apr 18 , 2025 | 09:50 AM
నిత్యం వేలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న కాచిగూడ రైల్వే స్టేషన్‌ను నిర్మించి నేటికి 109 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రైల్వే స్టేషన్‌ను 1916లో ప్రారంభించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ వారసత్వ భవనాలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి.

- చివరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో నిర్మాణం
- ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు
- నేడు వరల్డ్ హెరిటేజ్ డే
- రైల్వే మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం
హైదరాబాద్: ఎంతో చరిత్ర కలిగిన కాచిగూడ రైల్వే స్టేషన్(Kachiguda Railway Station) నిర్మించి నేటికి 109 ఏళ్లు పూర్తయ్యాయి. అఖరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను 1916 జూన్‌లో ప్రారంభించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ వారసత్వ భవనాలు చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి. నిజాం రాష్ట్ర రైల్వేకు ఈ స్టేషన్ ప్రధాన కేంద్రంగా ఉండేది. చుట్టూ మీనార్లు, మధ్యలో డోమ్‌లతో గోతిక్ ఆర్కిటెక్చర్ శైలిలో స్టేషన్‌ను నిర్మించారు.
ఈ వార్తను కూడా చదవండి: Leopard: ఇక్రిశాట్‌లో బంధించిన చిరుత జూకు తరలింపు..
ఈ భవనాన్ని చారిత్రక వారసత్వ సంపదగా గుర్తించి పరిరక్షిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో కొత్త భవనాలను నిర్మించినా చారిత్రక కట్టడాలకు నష్టం కలగకుండా దక్షిణమధ్య రైల్వే(South Central Railway) ప్రత్యేక చర్యలు తీసుకుంది. స్టేషన్‌కు 2023లో గ్రీనరీ ప్లాటినమ్, సోలార్ విద్యుత్ అవార్డుతోపాటు పలు అవార్డులు వచ్చాయి. రైల్వే స్టేషన్ నుంచి నిత్యం 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
రైల్వే చరిత్రకు నిలువుటద్దం మ్యూజియం
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మ్యూజియం చరిత్రకు నిలువుటద్దంగా నిలుస్తుంది. రైల్వేలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల గురించి మ్యూజియంలో తెలుసుకోవచ్చు. ఆనాడు బొగ్గుతో నడిచే ఆవిరి రైలు ఇంజన్ నుంచి నేటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వరకు, రైలు ఇంజన్లు, సిగ్నలింగ్ వ్యవస్థ ఇతర విభాగాల అభివృద్ధి, వాటి నమూనాలను రైల్వే చరిత్రకు సంబంధించిన ఛాయాచిత్రాలను మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
1916లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాచిగూడ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన అరుదైన ఫొటోను మ్యూజియంలో భద్రపరిచారు. ఈ నెల 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం కల్పించారు. విద్యార్థులు, ప్రయాణికులు శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియంను ఉచితంగా తిలకించవచ్చు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..
సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
సీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ సవాల్
అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News