Share News

Hyderabad: నోడౌట్.. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయం..

ABN , Publish Date - Oct 30 , 2025 | 10:29 AM

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం ఖాయమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ముషీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు ముఠా జైసింహ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేసేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

Hyderabad: నోడౌట్.. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయం..

- మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌(Jubilee Hills) ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం ఖాయమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌(Former Minister Koppula Eshwar) అన్నారు. ముషీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు ముఠా జైసింహ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేసేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు.


ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(Former Chief Minister KCR) హయాంలోనే తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో ప్రజలు బీఆర్‌ఎ్‌సకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మైనార్టీలు బీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించడంతో ప్రజలు కాంగ్రెస్‏పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఈ ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.


city7.2.jpg

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ చేసిన అభివృద్ధిని ప్రజలు మరిచిపోరని అన్నారు. షేక్‌పేటలో త్వరలో జరిగే కేటీఆర్‌ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా ముఠా జైసింహ కొప్పుల ఈశ్వర్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో భోలక్‌పూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు వై. శ్రీనివా్‌సరావు, సీనియర్‌ నాయకుడు బింగి నవీన్‌, డివిజన్‌ ఉపాధ్యక్షుడు శంకర్‌గౌడ్‌, సోషల్‌మీడియా ఇన్‌చార్జి ప్రవీణ్‌, సాయి పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌.. భిన్నంగా ఓటర్‌ పల్స్‌!

బీఆర్‌ఎస్‌ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 30 , 2025 | 10:29 AM