Food Poisoning: బీసీ హాస్టల్‌లో 86 మంది విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Nov 01 , 2025 | 08:20 AM
బీసీ బాలుర వసతి గృహంలోని ఆహారం కలుషితమై 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా... శుక్రవారం 110 మంది హాజరయ్యారు.
జోగులాంబ గద్వాల, నవంబర్ 1: జిల్లాలోని ఓ బీసీ హాస్టల్ కు చెందిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇటిక్యాల మండలం ధర్మవరంలోని బీసీ బాలుర వసతి గృహంలోని ఆహారం కలుషితమై(food poisoning) 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా... శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనాలయ్యాక 9 గంటల తర్వాత 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తర్వాత సుమారు 30 మందికిపైగా విద్యార్థులకు వాంతులు చేసుకున్నారు. మరికొందరు కడుపు నొప్పి(students fall sick)తో బాధపడ్డారు.
విద్యార్థులను గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. హాస్టల్ సిబ్బంది పోలీసులు 108 అబులెన్స్ లో విద్యార్థులను వెంటనే గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి(Gadwal hospital)కి తరలించారు. అక్కడ విద్యార్థులను పరీక్షించిన వైద్యులు వారికి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బురద మీద పడిందని బుద్ధి చెప్పింది.. ఈ మహిళ చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే..
ర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి