Share News

Hyderabad: కిటికీ గ్రిల్‌ తొలగించి.. 40 తులాల బంగారం చోరీ

ABN , Publish Date - Nov 01 , 2025 | 07:58 AM

తాళం వేసి ఉన్న ఇంటి కిటికీ గ్రిల్‌ తొలగించి లోపలకు వెళ్లిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. నాగోల్‌ పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్‌ సాయినగర్‌కాలనీ రోడ్డు నంబర్‌.1లో భాస్కర్‌, ప్రమీల దంపతులు నివాసముంటున్నారు. గత నెల 17న ఇంటికి తాళం వేసి నగరంలో ఉండే ప్రమీల సోదరుడు శ్రీనివాస్‏కు చెప్పి అమెరికాకు వెళ్లారు.

Hyderabad: కిటికీ గ్రిల్‌ తొలగించి.. 40 తులాల బంగారం చోరీ

హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇంటి కిటికీ గ్రిల్‌ తొలగించి లోపలకు వెళ్లిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. నాగోల్‌ పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్‌ సాయినగర్‌కాలనీ(Nagole Sainagar Colony) రోడ్డు నంబర్‌.1లో భాస్కర్‌, ప్రమీల దంపతులు నివాసముంటున్నారు. గత నెల 17న ఇంటికి తాళం వేసి నగరంలో ఉండే ప్రమీల సోదరుడు శ్రీనివాస్‏కు చెప్పి అమెరికా(America)కు వెళ్లారు. గురువారం ఇంట్లో లైట్లు వెలిగి ఉన్నాయని, కిటికీ గ్రిల్‌ తొలగించి ఉందని శ్రీనివాస్ కు ఆ ఇంటి ఎదురుగా ఉండే వినోద్‌ ఫోన్‌ చేశాడు.


city3.3.jpg

శ్రీనివాస్‌ ఇంటిని పరిశీలించి దొంగతనం జరిగినట్లు ప్రమీలకు సమాచారం ఇచ్చారు. బీరువాలోని 40 తులాల బంగారం, రెండు వెండి ప్లేట్లు, ఇతర వెండి ఆభరణాలు ఉన్నాయా అని చూడమని సూచించింది. శ్రీనివాస్‌ వెళ్లి చూడగా అవి కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


city3.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

నాలాల కబ్జాలను ఉపేక్షించొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 01 , 2025 | 08:02 AM