BJP MP Ravi Kishan: చంపుతామంటూ బీజేపీ ఎంపీకి ఫోనులో బెదిరింపులు
ABN , Publish Date - Oct 31 , 2025 | 09:13 PM
ఎంపీకి బెదిరింపు ఫోన్ రావడంపై ఆయన సెక్రటరీలు శివం ద్వివేది, పవన్ డూబే నేరుగా గోరఖ్‌పూర్ సీనియర్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలర్‌పై చర్చలు తీసుకోవాలని, ఎంపీకి భద్రత పెంచాలని కోరారు.
గోరఖ్‌పూర్: భారతీయ జనతా పార్టీ (BJP) గోరఖ్‌పూర్ పార్లమెంటు సభ్యుడు, నటుడు రవి కిషన్ శుక్లా (Ravi Kishan Shukla)ను చంపుతామంటూ నేరుగా ఫోనులో బెదిరింపులు వచ్చాయి. బిహార్ నుంచి ఈ కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. తన పేరును ఆరా జిల్లా జ్వానియా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ యాదవ్‌గా అతను పరిచయం చేసుకుంటూ, ఎంపీని చంపుతానంటూ బెదిరించాడు.
రవికిషన్ ప్రైవేటు సెక్రటరీ శివం ద్వివేది ఈ ఫోన్ రిసీస్ చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి ఎంపీని దూషిస్తూ యాదవులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కాల్చిచంపుతానని బెదిరించినట్టు తెలిపారు. దీనిపై శివం ద్వివేది వివరణ ఇచ్చారు. ఎంపీ రవికిషన్ శుక్లా ఎన్నడూ ఏ కులంపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఫోను చేసిన వ్యక్తి ఎంపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆయన కదలికలను ఎప్పుడుకప్పుడు గమనిస్తున్నానని, నాలుగు రోజుల తర్వాత బిహార్ వచ్చినప్పుడు ఆయనను చంపుతానని బెదిరించాడని చెప్పారు. కాగా, కాలర్ తన సంభాషణల్లో శ్రీరాముడు, అయోధ్య మందిరంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
కాగా, ఎంపీకి బెదిరింపు ఫోన్ రావడంపై ఆయన సెక్రటరీలు శివం ద్వివేది, పవన్ డూబే నేరుగా గోరఖ్‌పూర్ సీనియర్ పోలీసు అధికారులను కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. కాలర్‌పై చర్చలు తీసుకోవాలని, ఎంపీకి భద్రత పెంచాలని కోరారు. దీనిపై తాము విచారణ ప్రారంభించామని, కాలర్ ఆచూకీని గుర్తిస్తామని, ఎంపీ భద్రతను కూడా సమీక్షిస్తామని పోలీసులు చెప్పారు. భోజ్‌పురి, హిందీ నటుడిగా పేరున్న రవికిషన్ 2019 నుంచి గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మన ఆడకూతుళ్లు యుద్ధ విమానాలు నడుపుతున్నారు.. అంతర్జాతీయ ఆర్య మహా సమ్మేళన్‌లో మోదీ
కేజ్రీవాల్ కోసం మరో శీష్ మహల్.. ఫోటో షేర్ చేసిన బీజేపీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి