Share News

Janasena: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధం..

ABN , Publish Date - Nov 19 , 2025 | 09:47 AM

త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆపార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు ఆపార్టీ హైదరాబాద్‌ అధ్యక్షుడు రాజలింగం ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీని హైదరాబాద్ లో బలోపేతం చేయడమేగాక త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Janasena: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జనసేన పార్టీ సిద్ధం..

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ(GHMC) ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ(Janasena Party) సిద్ధంగా ఉందని ఆ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు రాజలింగం(Greater Hyderabad President Rajalingam) అన్నారు. ఈ మేరకు కూకట్‌పల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేపీహెచ్‌బీలో మంగళవారం సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్‌ హాజరై పార్టీ బలోపేతం, కార్యకర్తల సమీకరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రేమ్‌కుమార్‌, వీర మహిళ చైర్మన్‌ కావ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.


city4.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

సినిమాల‌కు.. ఇక సెల‌వు! నటనకు వీడ్కోలు.. పలికిన న‌టి తులసి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2025 | 11:50 AM