Hyderabad: కవిత X మల్లన్న
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:36 AM
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించి ఈ దాడికి పాల్పడ్డారు.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి
కల్వకుంట్ల కవితపై మల్లన్న వ్యాఖ్యలతో జాగృతి కార్యకర్తల ఆగ్రహం
కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం.. మల్లన్నపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం
అడ్డుకున్న గన్‌మెన్, కార్యాలయ సిబ్బంది.. తీవ్ర తోపులాట.. పలువురికి గాయాలు
గన్‌మెన్ కాల్పులు.. ఇరు వర్గాలపై కేసులు.. జాగృతి కార్యకర్త ఒకరికి ఆస్పత్రిలో చికిత్స
నాపై హత్యాయత్నం చేయించిన కవిత.. ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మల్లన్న
ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. బీసీల రిజర్వేషన్లపై మాట్లాడేందుకు కవిత ఎవరంటూ ఆమెపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్‌మెన్ కాల్పులు జరపడంతో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు తనపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన మల్లన్నను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ మండలి చైర్మన్‌కు కవిత ఫిర్యాదు చేశారు. అయితే తనపై కవిత హత్యాయత్నం చేయించారని మల్లన్న ఆరోపించారు. ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు.
పీర్జాదిగూడ/రాంనగర్/హైదరాబాద్ సిటీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించి ఈ దాడికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 30 మంది జాగృతి కార్యకర్తలు బోడుప్పల్‌లోని తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయానికి వచ్చారు. ‘జై కవితక్క’ అంటూ నినాదాలు చేస్తూ మల్లన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆఫీసులోని అద్దాలు, కుర్చీలను ధ్వంసం చేశారు. వారిని అడ్డుకునేందుకు క్యూన్యూస్ సిబ్బంది, మల్లన్న గన్‌మెన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర తోపులాట జరుగగా.. పలువురికి గాయాలయ్యాయి. కార్యాలయంలో మల్లన్న కూర్చున్న చాంబర్‌లోకి చొచ్చుకెళ్లేందుకు జాగృతి కార్యకర్తలు ప్రయత్నించగా.. గన్‌మెన్ అడ్డుకున్నారు. అయినా వారు వెనక్కి తగ్గకపోవడంతో కాల్పులు జరిపారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏం జరుగుతుందో కొద్దిసేపు ఎవరికీ అర్థం కాలేదు. దాడి అనంతరం క్యూ న్యూస్ కార్యాలయంలో ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో క్యూన్యూస్ కార్యాలయ ప్రాంగణం రక్తసిక్తంగా మారినట్టు కనిపించింది. దాడి క్రమంలో క్యూన్యూ్‌సలో పనిచేసే సిబ్బందితోపాటు, జాగృతి కార్యకర్తలకూ గాయాలయ్యాయి. దాడిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేతి వేలికి కూడా గాయమైంది.
జాగృతి కార్యకర్తకు గాయం.. ఆస్పత్రిలో చికిత్స
దాడి ఘటనలో ముషీరాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన జాగృతి కార్యకర్త సాయి గాయపడ్డారు. ఆయనను రాంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుడి చేతికి బలమైన గాయం కాగా.. తెగిన చోట కుట్లు వేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే మల్లన్న గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో సాయి చేతికి బుల్లెట్ తగలడం వల్లే.. లోతైన గాయమైందని జాగృతి కార్యకర్తలు చెబుతున్నారు. కానీ, కాల్పుల్లో ఎవరికీ బుల్లెట్ గాయాలు కాలేదని మల్కాజ్‌గిరి జోన్ డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి విషయం తెలుసుకున్న డీసీసీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు అడిగి తెలుసుకోవడంతోపాటు మల్లన్న గన్‌మెన్ కాల్పులు జరిపిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బుల్లెట్‌లకు సంబంధించిన షెల్స్ కోసం గాలింపు చేపట్టారు. కొన్ని బుల్లెట్‌లు రూఫ్‌కి తగలగా, మరికొన్ని గ్లాస్‌కు తగిలినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశామని మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి తెలిపారు. ఎమ్మెల్సీ కవిత ప్రోద్బలంతో ఆమె అనుచరులు దాడి చేశారన్న మల్లన్న ఫిర్యాదు మేరకు.. వారిపై బీఎన్‌ఎ్‌స సెక్షన్‌లు 191(2), 191(3), 333, 109, 324(4), 351(3), 132, రె/విత్ 190, 49 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు తీన్మార్ మల్లన్న అనుచరులు, భద్రతా సిబ్బంది తమపై కత్తులు, తుపాకులతో దాడి చేశారంటూ జాగృతి కార్యకర్త లింగమయ్య అలియాస్ అశోక్‌యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై, అతని అనుచరులపై బీఎన్‌ఎ్‌స 191(2), 191(3), 76, 127(2), 109, 351(3), రె/విత్ 149 ఐపీసీ సెక్షన్ 25, 27 ఆఫ్ ఆర్మ్‌స్ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వివాదానికి దారితీసిన వ్యాఖ్యలు..
జహీరాబాద్‌లో ఇటీవల బీసీ సంఘాలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న.. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలే వివాదానికి దారితీశాయి. మల్లన్న మాట్లాడుతూ, ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాగానే కల్వకుంట్ల కవిత రంగులు, గులాల్ చల్లుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వస్తే నీకేం సంబంధం? నువ్వు బీసీవా? నీకు, మాకు కంచం పొత్తు ఉందా?’’ అంటూ మరో అనుచిత వ్యాఖ్య చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాగృతి కార్యకర్తలు ఆగ్రహానికి గురయ
కవిత హత్యాయత్నం చేయించారు: తీన్మార్ మల్లన్న
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి కార్యకర్తలతో తనపై దాడి చేయించి హత్యాయత్నానికి పాల్పడ్డారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. వారి దాడిలో తనకు గాయమైందని తెలిపారు. తన గన్‌మెన్ వద్ద తుపాకీ లాక్కొని కాల్పులు జరిపేందుకు కూడా వారు ప్రయత్నించారని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని, తెలంగాణలో సాధారణంగానే ఆ పదాలు వాడుతారని అన్నారు. బీసీలందరూ దొరల గడీల వద్ద కాపలా కుక్కల్లా ఉండాలనే ఆలోచనను కవిత మానుకోవాలన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లపై ఉన్న కోపాన్ని తమపై చూపుతామంటే సహించేది లేదన్నారు. వారి దాడులతో బీసీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను చేస్తున్న ప్రయత్నం మానుకోనని ప్రకటించారు. తమపై దాడిని బీసీ మహిళలు సహించరని, కవితను తరిమి కొడతారని హెచ్చరించారు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడ్డ వారిని న్యాయస్థానానికి ఈడ్చి తగిన శిక్ష పడేంత వరకు వదిలిపెట్టబోమని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
వికసిత్ తెలంగాణ బీజేపీకే సాధ్యం
Read Latest Telangana News And Telugu News