IT Raids: దిల్‌రాజు, మరికొందరి స్టేట్‌మెంట్ల రికార్డు
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:40 AM
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారుల సోదాలు వరుసగా నాలుగోరోజు కొనసాగాయి.

ఆదాయం, పన్ను చెల్లింపుల్లో తేడాల గుర్తింపు
కీలక పత్రాలు, సాంకేతిక ఆధారాలు స్వాధీనం
నాలుగోరోజూ కొనసాగిన ఐటీ అధికార్ల సోదాలు
దిల్‌రాజును తీసుకెళ్లి మరీ పత్రాల పరిశీలన
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారుల సోదాలు వరుసగా నాలుగోరోజు కొనసాగాయి. గత మంగళవారం తెల్లవారుజాము నుంచి సినీ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సుకుమార్‌తోపాటు మిగతా వారికి సంబంధించి ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం సోదాలు ముగిసినా దిల్‌రాజు నివాసం, కార్యాలయాలు, వ్యాపార భాగస్వాముల నివాసాల్లో ఐటీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. శుక్రవారం సోదాల అనంతరం దిల్‌రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. దిల్‌రాజు ప్రొడక్షన్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు.
గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సహా ఇటీవల నిర్మించిన సినిమాల గురించి ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. డాకు మహారాజ్ సినిమాకు దిల్‌రాజు డిస్ట్రిబ్యూటర్‌గా ఉండటంతో ఆ సినిమా కలెక్షన్‌లపైనా కొన్ని వివరాలు ఐటీ అధికారులు సేకరించారు. దిల్‌రాజుతోపాటు ఎస్‌వీసీ ఆడిటర్, అకౌంటెండ్ స్టేట్‌మెంట్లను ఐటీ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం. వరుసగా నాలుగు రోజులు జరిగిన తనిఖీల్లో ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపునకు సంబంధించిన పలు పత్రాల్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లుగా పెట్టిన పెట్టుబడులు, వచ్చిన లాభాలు, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు ఐటీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం