Share News

Rajanna Siricilla: స్వశక్తికి ప్రోత్సాహం.. మహిళా సంఘాలకు ఆరు నెలల వడ్డీ రాయితీ విడుదల

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:33 PM

మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామన్న కొత్త ప్రభు త్వం వివిధ పథకాలతో స్వశక్తిసంఘాల మహిళల ఆర్థికా భివృద్ధిపై దృష్టి పెట్టింది. వడ్డీ రాయితీని విడుతల వారీగా విడుదల చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలోని పేరుకు పోయిన బకాలు చెల్లించకుండా కొత్తబకాయిల చెల్లింపుపైనే ప్రభుత్వం దృష్టి సారించింది.

Rajanna Siricilla: స్వశక్తికి ప్రోత్సాహం.. మహిళా సంఘాలకు ఆరు నెలల వడ్డీ రాయితీ విడుదల

- సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో రాయితీ రూ 4.64 కోట్లు

- పాత బకాయిలకు తప్పని ఎదురు చూపులు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామన్న కొత్త ప్రభు త్వం వివిధ పథకాలతో స్వశక్తిసంఘాల మహిళల ఆర్థికా భివృద్ధిపై దృష్టి పెట్టింది. వడ్డీ రాయితీని విడుతల వారీగా విడుదల చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలోని పేరుకు పోయిన బకాలు చెల్లించకుండా కొత్తబకాయిల చెల్లింపుపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధి కారంలోకి రావడంతోనే డిసెంబర్‌-2023 నుంచి 2024మార్చి వరకుఉన్న బకాయిల్లో రాజన్నసిరిసిల్ల(Rajanna Siricilla) జిల్లా స్వశక్తి సంఘా లకు రూ.7.39 కోట్లు విడుదల చేసింది.


మళ్లీ మహిళా శక్తి పథకం కింద 2024-25 సంవత్సరానికి సంబంధించిన గత సంవత్సరం ఏప్రిల్‌నుంచి సెప్టెంబర్‌ వరకు ఆరునెలల బకా యిలు 8,552సంఘాలకు రూ.11.77కోట్లు విడుదలయ్యా యి. మున్సిపాలిటీలు సంబంధించి 1,182సంఘాలు రూ. 2.13కోట్లు మంజూరు చేశారు. ఎన్‌యుఎల్‌ఎం కింద 1,088 సంఘాలకు రూ 2.51 కోట్లు మంజూరు ఇచ్చారు. ఇందులో సిరిసిల్ల మున్సిపాలిటీలో 810సంఘాలకు రూ.1.13కోట్లు, వేములవాడలో 372సంఘాలకు రూ. 42.47లక్షలు స్వశక్తి సంఘాలకు వడ్డీ రాయితీ విడుదల చేశారు.


- మహిళా సంఘాలకు యూనిట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళాశక్తి పథకం ద్వారా డెయిరీయూనిట్లు, అయిల్‌మిల్‌, పెరటికోళ్ల పెంపకం, ఆర్టీసీ బస్సులు, కుట్టుమిషన్‌ కేంద్రం, బేకరీలు, గిఫ్ట్‌ అర్టికల్స్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, మొబైల్‌ టిఫిన్‌సెంటర్‌లు, రిటైల్‌ ఫిష్‌ అవుట్‌లెట్‌లు, చట్నీస్‌, స్నాక్స్‌వంటి యూనిట్లు ప్రారం భించుకున్నారు. తాజాగా విడుదలైన వడ్డీమాఫీ డబ్బులు 8,552సంఘాలకు రూ.11.77కోట్లు సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. స్వశక్తి సంఘాలద్వారా 2012సంవత్సరంలో పావలావడ్డీ రుణాలను అందించడం అప్పటి ప్రభుత్వం మొదలు పెట్టింది.


zzzz.jpg

తర్వాత వడ్డీలేని రుణాలగా మార్చింది. ఇప్పటి వరకు జిల్లాలో 9,070సంఘాలు రూ.61.02కోట్ల వడ్డీ రాయితీ పొందారు. 2014-2015లో 7048సంఘాలకు రూ. 5.83కోట్లు, 2015-2016లో 7,181 సంఘాలకు 4.95కోట్లు, 2016-2017లో 7,547సంఘాలకు 7.33కోట్లు, 2017-2018లో 7,918సంఘాలకు 6.69కోట్లు, 2018-2020లో 9,070 సంఘాలకు మండలాల వారీగా రావాల్సిన వడ్డీ రాయితీ బకాయిలు (లక్షల్లో) రూ.17.03 కోట్లు, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 2023-2024లో రూ. 7,802 సంఘా లకు రూ. 7.39కోట్లు, 2024-2025లో రూ. 8,552 సంఘాలకు రూ. 11.77 కోట్లు రాయితీ అందుకున్నారు.


- పాత బకాయిలు రూ. 68.66 కోట్లు

మహిళలు స్వశక్తితో ఎదగడానికి ఆర్థికాభివృద్ధికి పొదుపు సంఘాలు బాటలు వేసినా ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ రాయితీ సకాలంలో రాకపోవడంతో ప్రయోజనం అందడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాత బకాయిల జోలికి వెళ్లకపోవడంతో నిరీక్షణ తప్పదా అని మహిళ సంఘాలు భావిస్తున్నాయి. జిల్లాలో 2020-21 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సం బంధించిన వడ్డీ రాయితీ బకాయిలు రూ. 68.66 కోట్లకు చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9,963 స్వశక్తి సంఘాలు, 411 గ్రామసంఘాలు, 12మండల సంఘాలు, వీటికి అను సంధానం చేస్లూ జిల్లా సమాఖ్య కూడా పనిచేస్తుంది.


స్వశక్తి సంఘాల పరిధిలో దాదాపు 1,12,637మంది సభ్యులు ఉన్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ వీరికి ప్రతి సంవత్సరం కోట్లలోనే వడ్డీలేని రుణాలను అంది స్తోంది. స్వశక్తి సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ అందించడంలో ఇబ్బందులు లేకపోయినా వడ్డీ రాయితీ మాత్రమే భారంగా మారింది. గత ప్రభుత్వ హయాం లో 9,755 స్వశక్తి సంఘాలకు రూ.68.66 కోట్లు వడ్డీ రాయితీ రావాల్సి ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 9051 సంఘాలకు రూ. 20.67 కోట్లు రాయితీ రావాల్సి ఉండగా 2021-22లో 9001 సంఘాలకు రూ.25.78 కోట్లు, 2022-23 సంవత్సరంలో 9,755 సంఘాలకు రూ.22.21కోట్లు రావాల్సి ఉంది.

srs1.jpg


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ కెమిస్ర్టీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి పతకం

Read Latest Telangana News and National News

Updated Date - Jul 16 , 2025 | 01:33 PM